నేను పుట్టింది బాపట్లలో... కానీ బ్లడ్ అంతా తెలంగాణతోనే... పవర్ స్టార్
, మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (15:50 IST)
ఏం ఎక్కడ పుడితే ఏం... ఎక్కడో పుట్టినవాడు తెలంగాణ ప్రజలు గురించి పట్టించుకోకూడదా...? అంటూ నిజామాబాద్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెరాస కెసిఆర్ పై ఫైర్ అయ్యారు. తాను పుట్టింది సీమాంధ్రలోని గుంటూరు జిల్లా బాపట్ల తాలూకలో అయినా పెరిగింది అంతా తెలంగాణ గడ్డపైనే అని పవన్ కళ్యాణ్ అన్నారు. తనను ఇంత స్థాయికి తెచ్చింది తెలంగాణ ప్రాంతమని, అందువల్ల తాను తెలంగాణ ప్రజల అభివృద్ధికి పాటుపడతానని చెప్పుకొచ్చారు. నిజామాద్ జిల్లాలో నరేంద్ర మోడి సభకు హాజరయిన పవన్ కళ్యాణ్ తెరాస, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. వందలమంది బలిదానాలు చేసుకుంటున్నా పట్టనట్లు వదిలేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ఇచ్చి దాని ద్వారా లబ్ది పొందాలన్న తాపత్రయం తప్ప తెలంగాణ అభివృద్ధికి ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పని పరిస్థితుల్లోనే ఇచ్చిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి అనీ, ఆయన ద్వారా దేశం బాగుపడుతుందని నమ్మడంవల్లే మద్దతు తెలుపుతున్నట్లు వివరించారు.