Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటినుంచి తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచారం!

నేటినుంచి తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచారం!
, శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (09:01 IST)
FILE
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు నుంచి తెలంగాణాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. టీడీపీ, బీజేపీ తరుపున పవన్ ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28 వరకు పవన్ ప్రచారం కొనసాగుతుంది.

పవన్ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి కృష్ణయ్య, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ఆయన వెంట పర్యటించనున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజమాబాద్ జిల్లాల్లో జరిగే వివిధ సభల్లో పవన్ పాల్గొంటారు.

పవన్ ప్రచార షెడ్యూల్: 25న షాద్‌నగర్, కల్వకుర్తి, సికింద్రాబాద్, ఖైరతా బాద్, శేరిలింగంపల్లిలో, 26న రామగుండం, సిరిసిల్ల, హుస్నాబాద్, పాల కుర్తిలో, 27న ఎల్‌బీనగర్, మహేశ్వరం, సనత్‌నగర్, ముషీరాబాద్, అంబర్ పేట్‌లో, 28న నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాల్కొండ నియోజక వర్గాల పరిధిలో పవన్ ప్రచారం నిర్వహించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu