నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబు
, మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (18:19 IST)
పాలమూరు సభలో నరేంద్ర మోడీని తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు పొగడ్తలతో ముంచెత్తారు. నరేంద్ర మోడిని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం, భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.గుజరాత్ రాష్ట్రంలాగే దేశాన్ని నరేంద్ర మోడీ అభివృద్ధి చేస్తారని బాబు అన్నారు. అవినీతిని ప్రక్షాళన చేయగలిగే సత్తా నరేంద్ర మోడికి ఉన్నదన్నారు. చేవెళ్ల, ప్రాణహిత ప్రాజెక్టుల పూర్తి చేసుకోవాలంటే నరేంద్ర మోడీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.