తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి జయసుధ... గీతారెడ్డి...?
, శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (19:34 IST)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అటు తెరాసను ఇటు తెదేపాను ఒకేసారి తన ప్రకటనతో కొట్టేశారు. బీసీ ముఖ్యమంత్రి అంటూ బాబు ముందుకు వెళుతుంటే, కేసీఆర్ ఏమాటా చెప్పకుండా తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్లు పోతుంటే వారికి బ్రేకులు వేస్తూ తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆకాంక్ష అంటూ తెరపైకి కొత్త చర్చను తెచ్చారు రాహుల్. ఇపుడు ఆ తొలి మహిళా ముఖ్యమంత్రి రేసు గురించి తెలంగాణలో అప్పుడే చర్చలు జరిగిపోతున్నాయి. సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి గీతారెడ్డి రేసులో ముందు వరుసలో ఉన్నారని కొందరంటుంటే, అలాక్కాదు సినీనటి జయసుధకు దక్కే ఛాన్స్ ఉందని మరికొందరు అంటున్నారు. వీరిద్దరూ కాదు.. గద్వేల్ నాయకురాలు డి.కె అరుణకు ఛాన్స్ పుష్కలంగా ఉందని మరికొందరు అంటున్నారు. మొత్తమ్మీద జానారెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నాల వగైరా వగైరా నాయకులకు ఇక సీఎం పీఠం అందని ద్రాక్షేనన్నమాట. 'యువరాజు' ఎంతమాట చెప్పి వెళ్లిండు...?