టీడీపి తరపున ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నారా...?
, బుధవారం, 23 ఏప్రియల్ 2014 (21:15 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ-బీజేపీ రెండు పార్టీలకు 2014 ఎన్నికల కోసం ప్రచారం చేస్తానని ప్రకటించిన కొద్దిగంటలలోనే జూ. ఎన్టీఆర్ టీడీపీ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తన ప్రచారానికి సంబంధించిన వివరాలు గురువారం మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నట్లు జూ.ఎన్టీఆర్ సన్నిహితులు చెపుతున్నారు.ఎన్టీఆర్ ప్రచారానికి సంబంధించి రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధమయినట్లు సమాచారం. 2009లో జూ. ఎన్టీఆర్ టీడీపీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన ఎన్టీఆర్ 2014లో కూడా టీడీపీ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.