టిడిపి 6వ జాబితాలోనూ హరికృష్ణ పేరు లేదు... కనఫర్మ్ మొండిచెయ్యి
, శనివారం, 19 ఏప్రియల్ 2014 (12:54 IST)
నందమూరి హరికృష్ణను పూర్తిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఉద్వాసన చెపుతున్నారా... అనే సందేహం రోజురోజుకీ బలపడుతోంది. హరికృష్ణకు అసెంబ్లీ లేదా లోక్ సభ సీట్లలో ఏ స్థానాన్ని కేటాయించకుండా చంద్రబాబు నాయుడు తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా 6వ జాబితాలోనూ హరి పేరు లేదు. దీంతో ఇక హరికృష్ణకు ఈ 2014 ఎన్నికల్లో తెదేపా చోటు ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో పోటీ చేసే తన శాసనసభ అభ్యర్ధుల ఆరో జాబితా వివరాలు ఇలా ఉన్నాయి... పిఠాపురం- పోతుల విశ్వం పెద్దాపురం- నిమ్మకాయల చిన రాజప్ప భీమవరం- పులపర్తి రామాంజనేయులు సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనంతపురం(అర్బన్)- ప్రభాకర్ చౌదరి