జనం ఇలా ఓట్లేస్తున్నారంటే తెదేపా గెలుస్తుందనుకుంటా... లగడపాటి
, బుధవారం, 7 మే 2014 (17:28 IST)
ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లోని 13 జిల్లాల జనం ఇంత భారీగా ఓట్లు వేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉన్నదేమోనని లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 70 శాతానికి పైగా ఓటింగ్ శాతం ఉంటుందని జోస్యం చెప్పారు. కాగా ఎగ్జిట్ పోల్స్ పై తనకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిందని తెలిపారు.బుధవారంనాడు లగడపాటి హైదరాబాదులో మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాననే కారణంతో ఈసీ తనకు నోటీసు ఇచ్చిందన్నారు. కానీ తాను ఎన్నికల కోడ్‌కి లోబడి మాత్రమే స్పందించానన్నారు. కేవలం పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే తెలిపాననీ, ఎక్కడా సర్వేకు సంబంధించిన వివరాలు తెలియజేయలేదని చెప్పారు.