Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌పై 22 కేసులు... విచారణ దశలోనే... ఆస్తులు రూ.416 కోట్లు...

జగన్‌పై 22 కేసులు... విచారణ దశలోనే... ఆస్తులు రూ.416 కోట్లు...
, శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (11:49 IST)
WD
ఎన్నికలు 2014లో పోటీ చేసేందుకు కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ గురువారంనాడు భారీస్థాయి కార్యకర్తలతో పులివెందుల ఎన్నికల కమిషన్ అధికారుల వద్దకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ లో పలు విషయాలను పేర్కొన్నారు. తనపై 22 కేసులు నమోదయి ఉన్నాయని ఆయన వెల్లడించారు. సిబిఐ కోర్టులో 2012 ఏప్రిల్ నెల నుండి ఈ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు జగన్ పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని సిబిఐ కేసులను విచారణ చేస్తోందని తెలిపారు.

ఇంకా తన ఆస్తులు రూ. 416 కోట్లుగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ 416 కోట్ల రూపాయల ఆస్తుల్లో రూ. 344 కోట్లు తన పేరుపై ఉండగా మిగిలినవి అంటే, రూ. 72 కోట్లు తన భార్య భారతి పేరుపై ఉన్నాయని తెలిపారు. తనకు కనీసం సొంత వాహనం లేదని తెలిపారు. ఐకే 2011 ఉపఎన్నికల సందర్భంగా తన ఆస్తులను రూ. 445 కోట్లుగా చూపించిన జగన్ ఇప్పుడు తన ఆస్తులు రూ. 416 కోట్లుగా ఉన్నట్లు చూపించడంతో ఆయన ఆస్తి కొంతమేర కరిగిపోయిందని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu