గుజరాత్ పోల్ సీన్... నరేంద్ర మోడీ స్వీప్... 20 - 26
, బుధవారం, 2 ఏప్రియల్ 2014 (20:58 IST)
గుజరాత్ రాష్ట్ర ప్రజలు మూకుమ్మడిగా తమ నిర్ణయాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి, భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడిపై చూపించబోతున్నట్లు ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన సర్వేలో తేటతెల్లమయింది. మొత్తం 26 స్థానాలున్న గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 20 నుంచి 26 స్థానాలను కైవసం చేసుకోబోతున్నట్లు సర్వేలో తేలింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 4 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతున్నట్లు సర్వే ఫలితాలు తెలిపాయి. ఇతరులు 0 నుంచి 2 స్థానాలను దక్కించుకుంటారని సర్వే వివరించింది. సర్వే ఫలితాల ప్రకారం భాజపా 55 శాతం ఓట్లను దక్కించుకుంటే, కాంగ్రెస్ 31, ఆమ్ ఆద్మీ 6 శాతం ఓట్లను రాబట్టుకుంటుందని తేలింది. 2009
ఎన్నికల్లో చూసినప్పుడు భాజపాకు 47 శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్ పార్టీకి 43 శాతం వచ్చాయి. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ గల్లంతు కాబోతున్నట్లు సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది.