Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్ ఆశయ సాధన కోసమే రాజకీయాల్లోకి : బాలకృష్ణ

Advertiesment
బాలృష్ణ
, మంగళవారం, 1 ఏప్రియల్ 2014 (10:00 IST)
File
FILE
తన తండ్రి, దివంగత స్వర్గీయ ఎన్టీ. రామారావు ఆశయ సాధన కోసమే తాను క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్టు సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆయన నటించిన తాజా చిత్రం లెజెండ్ చిత్రం మంచి సక్సెస్‌ను సాధించడంతో ఈ చిత్రం యూనిట్‌తో కలిసి బాలయ్య మంగళవారం సింహాచలంలోని సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు.

అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి నందమూరి తారక రామారావుగారి ఆశయాలను సాధించడం కోసం తాను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో రెండు, మూడు స్థానాల నుంచి పోటీ చేయాలనే ఒత్తిడి వస్తోందన్నారు.

అయితే, పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించిన అనంతరం ఎక్కడ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ... సినిమాల్లో నటిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu