విజయశాంతికి పెళ్లయింది... భర్తకు చెన్నై, హైదరాబాద్ లో ఆస్తులు
, గురువారం, 10 ఏప్రియల్ 2014 (13:08 IST)
చాలామందికి అసలు విజయశాంతికి పెళ్లయిందా కాలేదా అని డౌట్ వ్యక్తపరుస్తుంటారు. కానీ 2014 ఎన్నికలు అఫిడవిట్లో ఈ డౌట్‌ను క్లియర్ చేసింది విజయశాంతి. మెదక్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన సందర్భంలో విజయశాంతి తన ఆస్తుల వివరాలు తెలిపారు. ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం చెన్నై కోయంబేడులో రూ. 27 కోట్లు విలువ చేసే వ్యవసాయేతర భూమి, చెన్నై అన్నా నగర్లో రూ. 1.80 కోట్ల విలువ చేసే వ్యవసాయ భూమి భర్త పేరిట ఉన్నట్లు వెల్లడించారు. ఇంకా తన వద్ద రూ. 57 లక్షలకు పైగా విలువైన బంగారం, టయోటా కారున్నదని పేర్కొన్నారు. హైదరాబాదులోని విఆర్ నగర్లో భర్త పేరిట రూ.36.41 లక్షల ఇంటి స్థలంతో పాటు పటాన్ చెరులో రూ.71 లక్షల విలువైన మరో స్థలం ఉన్నట్లు విజయశాంతి వెల్లడించారు. ఇంకా తన పేరిట ఉన్న బ్యాంకు ఖాతాల్లో నగదు కూడా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.