భయ్యా రాహుల్ సూపర్ వర్క్... పొగిడిన వరుణ్: సెంటిమెంట్ గుర్తొచ్చిందా...?
, బుధవారం, 2 ఏప్రియల్ 2014 (17:21 IST)
భాజపా సుల్తాన్‌పుర పార్లమెంట్ సభ్యుడు వరుణ్ గాంధీకి సెంటిమెంట్ గుర్తొచ్చినట్లుగా ఉంది. తన రాజకీయ ప్రత్యర్థి ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఉన్నట్లుండి పొగడ్తల జల్లు కురిపించారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ సోదరుడయిన దివంగత సంజయ్ గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ. రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీని పొగడటం బహుశా ఇదే తొలిసారేమో గానీ రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న సమయంలో... అమేథీలో మహిళల సాధికారత కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషి అద్భుతమని ప్రశంసలతో ముంచెత్తాడు. దాయాది సోదరులయిన వీరికి ఒకరంటే ఒకరికి గిట్టదు. రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ ఇద్దరూ పరస్పర భిన్నమైన కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఉన్నవారు. ఐనప్పటికీ సోదరుడు పొగడటంతో రాహుల్ గాంధీ కూడా సానుకూలంగానే స్పందించాడు. తన సోదరుడు తన పనితీరును మెచ్చుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు.