పవన్ కళ్యాణ్ ట్విస్ట్: జగన్‌కు ప్రశ్న... చిరంజీవికి షాక్... పీవీపీకి సై....
, మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (20:05 IST)
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన తొలి ప్రచార సభలో అదరగొట్టారు. రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత పవన్ బుధవారం కర్నాటక ఎన్నికల ప్రచారంలో తొలిసారి నిర్వహించారు. బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. మరోవైపు.. సోమవారం కూడా బెంగళూరులో రోడ్డు షో నిర్వహించారు. చిరు ప్రచారానికి ధీటుగా పవన్ ప్రచారం చేశారు. చిరుకు పోటెత్తినట్లుగానే అభిమానులు, ప్రజలు పవన్ కోసం తరలి వచ్చారు. చిరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయగా.. పవన్ బిజెపి అభ్యర్థులకు, మోడీ కోసం ప్రచారం చేశారు. తెలుగు జాతిని చీల్చిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని మండిపడ్డారు. అంతేకాకుండా తానెవరికి మద్దతిచ్చేది మరింత స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ - టీడీపీ కూటమి గెలుపు కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. అదేసమయంలో మల్కాజిగిరి విషయంలో మాత్రం టీడీపీ - బీజేపీ కూటమికి షాకిచ్చారు. జేపీకి మద్దతుగా ప్రచారం చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే, విజయవాడలో కూడా టీడీపీ అభ్యర్థి కేశినేనినానికి కూడా షాకిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పీవీపీ వెంచర్స్ అధినేత పి వర ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే ఆయన తరపున ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.