Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను చనిపోయాక నా ఆస్తులన్నీ మెదక్ వాసులకే... విజయశాంతి

నేను చనిపోయాక నా ఆస్తులన్నీ మెదక్ వాసులకే... విజయశాంతి
, శనివారం, 26 ఏప్రియల్ 2014 (14:49 IST)
FILE
ఎన్నికలు 2014 మరింత సెంటిమెంట్ కలర్ ను ఆపాదించుకుంటున్నట్లు కనబడుతున్నాయి. నిన్న రాహుల్ గాంధీ తెలంగాణకు మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నట్లు చెప్పిన నేపధ్యంలో విజయశాంతి తన మనసులోని మాటను బయటపెట్టారు. తాను చనిపోయిన తర్వాత తన ఆస్తులన్నీ మెదక్ వాసులకే చెందేట్లు రాసిచ్చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయశాంతి శనివారంనాడు రామాయంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానన్న రాములమ్మ తన ఆస్తులపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాని అన్నారు.

రాజకీయాల్లోకి ప్రవేశించి వెనకేసుకున్న డబ్బు ఏమీ లేదనీ, ఒకవేళ ఉన్నట్లు నిరూపిస్తే అదంతా మెదక్ నియోజకవర్గ ప్రజలకే ఇచ్చేస్తానని చెప్పారు. మొత్తమ్మీద మెదక్ ప్రజలను విజయశాంతి తనదైన శైలిలో సెంటిమెంట్ పండించారు.

Share this Story:

Follow Webdunia telugu