నగ్మా యువకుడికి చెంప దెబ్బ... అబ్బే కొట్టలేదు... నెట్టాను
, గురువారం, 3 ఏప్రియల్ 2014 (14:06 IST)
సినీ నటి నగ్మా మీరట్ ప్రచారంలో ఓ యువకుడికి చెంప దెబ్బ ఇచ్చినట్లు వచ్చిన ప్రచారాన్ని తోసిపుచ్చింది. మీరట్ లోక్ సభ పరిధిలో తాను పర్యటించేటపుడు ఒక యువకుడిని కొట్టానన్న వార్తపై వివరణ ఇస్తూ... తను అస్సలు ఎవర్నీ కొట్టలేదనీ, మీద పడుతున్న వారిని పక్కకు తోసినట్లు నగ్మా చెప్పుకొచ్చింది. ఓ ప్రజాప్రతినిధి తనను ముద్దు పెట్టుకున్నట్లుగా వచ్చిన వార్తలపై కూడా నగ్మా మాట్లాడుతూ... అది కూడా అబద్ధమని చెప్పింది. ఆయన తనకు ఏదో విషయం చెప్పబోయాడని వివరణ ఇచ్చింది.కాగా నగ్మా ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయనీ, అందువల్ల ఆమెకు ప్రత్యేకంగా భద్రత కల్పించాల్సిందిగా ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది కాంగ్రెస్ పార్టీ. నగ్మా ప్రచారం చేస్తున్నప్పుడు జన సందోహం భారీగా హాజరవుతున్నారనీ, ఆ సమయంలో కొంతమంది ఆకతాయిలు ఆమెను ఇబ్బందిపెట్టే చర్యలకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అదేమోగానీ ముద్దు పెట్టుకున్న కాంగ్రెస్ నాయకుడిపై ఇంతవరకూ చర్య ఎందుకు తీసుకోలేదని కొందరు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ దీనికి బదులు ఏమి చెపుతుందో...?