తమ్ముడు దారి తప్పాడు... ప్రియాంక: అక్క రేఖ దాటింది... వరుణ్
, మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (15:29 IST)
చాలా రోజుల తర్వాత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ తన చిన్నమ్మ కుమారుడు వరుణ్ గాంధీపై నిప్పులు చెరిగారు. తమ్ముడు దారి తప్పాడంటూ విమర్శించారు. దీనిపై మేనక కుమారుడు వరణ్ గాంధీ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. మంగళవారం ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర నియోజకవర్గం నుండి లోక్ సభకు నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన సందర్భంలో మాట్లాడారు. తండ్రి సంజయ్ గాంధీని గుర్తు చేస్తూ తనకు ఓటు వేయాలని కోరారు. పనిలోపనిగా ప్రియాంక గాంధీకి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. తాను ఎన్నడూ లక్ష్మణ రేఖ దాటలేదనీ, ఐతే తన సోదరి ప్రియాంకా గాంధీ మాత్రం లక్ష్మణ రేఖ దాటారని అన్నారు. తను దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాననీ, దేశ సమగ్రతను కాపాడేందుకే రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకున్నారు. ఐతే ప్రియాంక మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.