Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిఎంకె నుంచి అళగిరి శాశ్వత బహిష్కరణ... హేపీగా ఉంది

Advertiesment
అళగిరి
, మంగళవారం, 25 మార్చి 2014 (19:04 IST)
FILE
డిఎంకె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తన పెద్ద కుమారుడు అళగిరి పాల్పడుతున్నారంటూ డిఎంకె అధినేత 89 ఏళ్ల కరుణానిధి అళగిరిని పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరణ వేటు వేశారు. కరుణానిధి మంగళవారం ఓ ప్రకటనలో అళగిరిపై వేటు వేసినట్లు తెలిపారు. అళగిరిని సస్పెండ్ చేసిన 2 నెలల తర్వాత మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అళగిరిపై వేటు వేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు అళగిరితో కుమార్తె కనిమొళి సన్నిహితులు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా సోదరుడు స్టాలిన్తో వారసత్వ పోరులో సోదరుడు స్టాలిన్ పైనే కాకుండా తండ్రి కరుణానిధి పైకూడా అళగిరి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ఎక్కువమంది స్టాలిన్ వర్గం వారు ఉండటంతో అళగిరి తీవ్ర అసహనానికి గురయినట్లు సమాచారం. దీంతో ఏకంగా పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో బీజేపీ, ఎండీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులు పలువురు అళగిరి ఇంటికి క్యూ కట్టడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu