జగ్గారెడ్డికి 2014 ఎన్నికల్లో పోటీ చేయగలరా...?
, శనివారం, 5 ఏప్రియల్ 2014 (17:56 IST)
సిద్ధిపేటలో జగ్గారెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో మెదక్ జిల్లా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హజరు పరిచి రెండు రోజుల రిమాండ్‌కు తరలించారు. సమైక్య కింగ్ అని ఎవరినయినా అనాలని అంటే అది జగ్గారెడ్డి అని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే తెలంగాణలో ప్రజా ప్రతినిధులందరూ రాష్ట్రాన్ని ముక్కలు చేసి తెలంగాణ ఇచ్చేయాలని గోల చేస్తే కాదుకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిందేనంటూ ధైర్యంగా చెప్పిన తెలంగాణ నాయకుడు సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి... ముద్దుగా జగ్గారెడ్డి. జగ్గారెడ్డి మాట అప్పటి నుంచి ఇప్పటివరకూ ఒకటే. అదే రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నది. కాకపోతే తెలంగాణ విడిపోయింది కాబట్టి తాను ఒక్కడినే ఏం చేయగలను అంటున్నారనుకోండి. ఇంతకీ ఈ జగ్గారెడ్డి గురించి పాత విషయాలను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.... ఆయనను ఓ కేసు విషయంలో పోలీసులు అరెస్టు చేశారు.రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో మెదక్ జిల్లా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హజరు పరిచి రెండు రోజుల రిమాండ్‌కు తరలించారు. ఈయనపై గత 2010 సంవత్సరంలో ఈ కేసు నమోదు కాగా, ఆయనను పోలీసులు ఇపుడు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకానందున ఆయనకు నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీచేసింది. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఈ నెల 7న కోర్టు విచారించనుంది. కాగా అరెస్టు అయిన నేపధ్యంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.