జగన్ మాట నిజం... ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ ఒక వేవ్ లేస్తుంది...
, శుక్రవారం, 16 మే 2014 (12:48 IST)
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే వార్మప్ మ్యాచ్ ను చూపించిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అదే దూకుడు ప్రదర్శించింది. ఐతే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డిని ఫలితాలపై కదిలించినప్పుడు.... ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ ఒక కెరటంలా వేవ్ వస్తుందనీ, ఆ ఫలితాలను మీరు చూడబోతున్నారని అన్నారు. అది జగన్ పార్టీలో కాదు కానీ తెలుగుదేశం పార్టీ విషయంలో నిజమయినట్లు కనబడుతోంది. సీమాంధ్ర ప్రజలు అనూహ్యంగా నారా చంద్రబాబు నాయుడికి ఏకంగా 108 స్థానాలను కట్టబెట్టే దిశగా ఓట్లు వేసినట్లు అర్థమవుతోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు తొలి ముఖ్యమంత్రి కాబోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 63 స్థానాలతో సరిపెట్టుకునే దిశలో నడుస్తోంది. బీజేపి 3 స్థానాల్లో విజయం సాధించే దిశగా వెళుతోంది.