Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్‌ను తిట్టే దమ్మూ ధైర్యం జగన్‌కు లేదు : పవన్ కళ్యాణ్

కేసీఆర్‌ను తిట్టే దమ్మూ ధైర్యం జగన్‌కు లేదు : పవన్ కళ్యాణ్
, గురువారం, 1 మే 2014 (14:33 IST)
File
FILE
సీమాంధ్ర ప్రజలను నిరంతరం దూషించే టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావును తిట్టే దమ్మూ ధైర్యం వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికు లేవని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. అసలు ఆయనలో సీమ పౌరుషం ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ - బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం మదనపల్లిలో జరిగిన బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు.

కేసీఆర్ తిడుతున్నా జగన్ ఒక్క మాట మాట్లాడరని ఆరోపించారు. కేసీఆర్‌ను అనే ధైర్యం జగన్‌కు లేదన్నారు. అసలు వారిద్దరికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అటు వైఎస్ దోపిడీ విధానం వల్లే తెలంగాణ సమస్య తెరపైకి వచ్చింది, హైదరాబాదు, రంగారెడ్డి, చిత్తూరు జిల్లాలో సెజ్‌ల పేరిట దోచుకున్నారని విమర్శించారు.

సీమాంధ్ర పౌరుషం, దమ్ము, ధైర్యం జగన్‌కు లేదా అన్న పవన్ సీమాంధ్ర గౌరవాన్ని కాపాడలేని జగన్‌కు సీఎం పదవి ఎందుకని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వస్తే దోపిడీ, దొంగల రాజ్యం తప్పదన్నారు. సాక్షి తనపై అనుచిత విమర్శలు చేస్తోందని అయినా భయపడబోనన్నారు. ఇక రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన విడదీసిన తల్లీకొడుకులు సోనియా, రాహుల్లేనని, వారిపైనే తన విమర్శలని పవన్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu