కాంగ్రెస్ లోకి మైనంపల్లి... చంద్రబాబుకు షాక్
, సోమవారం, 7 ఏప్రియల్ 2014 (13:02 IST)
ఎన్నికల నేపధ్యంలో తెలుగుదేశం, బీజేపీల మధ్య పొత్తు కుదరటంతో ఆయా నియోజకవర్గాలలో సర్దుబాట్లు జరుగుతుండటంతో తెలుగుదేశం పార్టీకి బాగా ఇబ్బందులు తలెత్తినట్లు కనిపిస్తోంది. నరసరావుపేట అసెంబ్లీ సీటు విషయంలో తెదేపా సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు నుంచి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి కొత్తగా మరో సమస్య ఎదురుగా వచ్చి వెక్కిరిస్తోంది. హైదరాబాద్‌లోని మల్కాజిగిరి శాసనసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తనకు నాలుగేళ్ల క్రితమే బాబు తనకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. పొత్తులో భాగంగా ఇప్పుడు మల్కాజ్గిరి స్థానాన్ని బీజేపీకి కట్టబెడుతున్నారని విమర్శించారు. మైనంపల్లికి కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ లభించినట్లు వార్తలు వస్తున్నాయి.