అసెంబ్లీ రిజల్ట్స్ పై భవిష్యవాణి... ఏపీలో తెదేపా 100+, టి.లో తెరాస 60+
, మంగళవారం, 13 మే 2014 (15:26 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై ప్రముఖ భవిష్యవాణి నిపుణులు డాక్టర్ రామన్ ఇలా చెపుతున్నారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ రెండూ పోటాపోటీగా ఉంటాయన్నారు. ఒకింత తెలుగుదేశం పార్టీ 100 సీట్లు సాధించే అవకాశం ఉన్నదనీ, ఐతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా సీమాంధ్రలో పోటీ గట్టిగా ఇస్తుందన్నారు. ఇక తెలంగాణలో తెరాస 60కి పైగా స్థానాలు సాధించే అవకాశం ఉన్నదన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుందన్నారు. కేంద్రంలో మాత్రం భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఇక మరో ప్రముఖ భవిష్యవాణి నిపుణులు కె.ఆర్.పురుషోత్తమన్ గణాంకాల ప్రకారం ఎన్డీఎ 248, యూపీఎ 110, వామపక్షాలు 37, తృణమూల్ 21, ఎస్పీ 19, ఏఐఎడీఎంకె 16, బీఎస్పీ 15, జనతాదళ్ 12, ఆమ్ ఆద్మీ 12, డీఎంకె 11, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 7, తెరాస 7, జైసపా 7, బీజెడి 6, జనతాదళ్ 4, ఇంకా మిగిలినవి ఇతరులు కైవసం చేసుకుంటారని తెలిపారు.