Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంతకీ తెలంగాణలో ఫస్ట్ సీఎం సీటు కొట్టే 'పండుగా(డు)రు' ఎవరు...?

ఇంతకీ తెలంగాణలో ఫస్ట్ సీఎం సీటు కొట్టే 'పండుగా(డు)రు' ఎవరు...?
, సోమవారం, 7 ఏప్రియల్ 2014 (17:42 IST)
WD
తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలు కలగూరగంపలా తయారయ్యాయి. మొన్నటివరకూ కేసీఆర్ సైతం గెలుపు నాదే... నేనే కాబోయే ముఖ్యమంత్రిని... అధికారం నాదే అంటూ గొప్పలు చెప్పుకున్నా, తెదేపా-భాజపా మైత్రి దెబ్బకు బెంబేలెత్తిపోతున్నారు. నాకొక్కసారి అవకాశం ఇస్తే అద్భుతం చూపిస్తానంటూ మళ్లీ ప్రజలనే అడుగుతున్నారు. ఇంతకీ తెలంగాణలో తెలంగాణ పీఠంపై కూర్చుని ఆ 'పండుగా(డు)రు' ఎవరో అని ట్విట్టర్లో తెగ చర్చించుకుంటున్నారు.

విషయం చూస్తే తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదే కాబట్టి తెలంగాణ ప్రజలంతా కట్టగట్టుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని కాంగ్రెస్ పార్టీ చెపుతోంది. ఐతే ఆ వెనకాలే... లెక్కలు వేసుకుంటూ జడుసుకుంటోందనుకోండి. ఇక తెరాస ఉద్యమం చేసి 60 ఏళ్ల కలను సాకారం చేశామనీ, ఆ క్రెడిట్ తమదే కాబట్టి తెలంగాణ ప్రజలంతా గులాబీ పార్టీకి ఓటు వేసేందుకు చూపుడు వేళ్లు సిద్ధంగా పెట్టుకుని ఉన్నారంటూ హంగామా చేస్తున్నారు. కానీ ఎక్కడో తంతుంది అన్నయ్యా అని ఏదో ఒక మూలన కూర్చున్న తెరాస నాయకుడు గొణుక్కోవడం వినిపిస్తోంది.

చివరాఖరికి తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఏర్పాటు చేయండి అంటూ తాము ఉత్తరం రాసినందుకే కాంగ్రెస్ పార్టీ అంత సాహసం చేయగలిగిందనీ, లేదంటే 60 ఏళ్ల తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నిస్తోంది. నిజమే అని అందరూ తలలు ఊపుతున్నా... ఓటు దగ్గరికి వచ్చేసరికి సరే వేస్తాం కదా చూడండి అంటున్నారు. దీంతో తెలంగాణ ఓటరన్న నాడి తెలియక హస్తం, కారు, సైకిల్, కమలం అన్నీ గందరగోళంలో పడి కొట్టుమిట్టాడుతున్నాయి. చూడాలి తెలంగాణ ప్రజలు ఎవరిని టి.తొలి సీఎం చేస్తారో...?

Share this Story:

Follow Webdunia telugu