Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హనీడేట్‌

Advertiesment
దీపావళి స్పెషల్ మైదాపిండి ఖర్జూరాలు తేనె నూనె చపాతీ గింజలు మిక్సీ పేస్టు బాణలి చతురస్త్రాకారం మందం కొసలు పిండి
, శనివారం, 25 అక్టోబరు 2008 (18:11 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
మైదాపిండి... పావుకేజీ
ఖర్జూరాలు... పావుకేజీ
తేనె... వంద గ్రాములు
నూనె... వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
మైదాపిండిని చపాతీ పిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. ఖర్జూరాల్లోని గింజలు తొలగించి మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి, కలిపి పెట్టుకున్న మైదాపిండిలో కాస్తంత పోసి మెత్తగా కలిపి, చతురస్త్రాకారంలో కాస్త మందంగా వత్తాలి.

దీనిపై సరిపడా ఖర్జూరాల ముద్దను పెట్టి మందంగా పూయాలి. తరువాత దీన్ని మడిచి, కొసలు మూసేయాలి. ఇలా మొత్తం పిండిని చేసిన తరువాత వాటిని కనీసం పదినిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆరిన తరువాత వాటిని స్లైసుల్లాగా కోసి కాగుతున్న నూనెలో వేసి వేయించాలి. ఇలా వేయించిన వాటిని తేనెలో ముంచి తీయాలి. అంతే హనీ డేట్ తయారైనట్లే...! తీపి అంతగా ఇష్టంలేనివారు వేయించిన స్లైసులపై తేనెను కాస్త చిలకరిస్తే సరిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu