Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి రోజున లక్ష్మీగణపతులను పూజించండి

Advertiesment
దీపావళి
FILE
లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో చక్కటి శుభ్రత ఒకటి. శుభ్రంగా కళ కళ లాడే ఇంట ఆ లక్ష్మీదేవి నివాసముంటుంది. అమ్మవారు తాము పెట్టిన దీపాల వెంట రావాలని కోరుతూ సాయంత్రమయ్యే సరికి ప్రమిదల దీపాలు, లేదంటే, రంగురంగుల బల్బులు కల తోరణాలను ఇంటికి కట్టి అలంకరణలు చేస్తారు.

ఇక దీపావళి పూజలో ప్రధానంగా వినాయకుడిని, మాత లక్ష్మీ దేవిని పూజించాలని పురోహితులు అంటున్నారు. ఏ పూజ చేసినా విఘ్నఅధిపతి అయిన వినాయకుడిని ముందుగా పూజించాలి. దీని తర్వాత లక్ష్మీ దేవిని ఆమె మూడు రూపాలయిన లక్ష్మీ, సరస్వతి, మహా కాళి, రూపాలలో పూజిస్తారు. వీరితో పాటు ధనాగారాలకు అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు. దీపావళి నాడు లక్ష్మీ గణపతులను పూజిస్తారు.
webdunia
FILE


లక్ష్మీదేవి రూపం గణపతితో పాటు వుంటుంది. అందుచేత తాము నిర్వహించే కార్యాలకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడాలని సిరులిచ్చే తల్లి కరుణాకటాక్షాలు ఎల్లవేళలావుండాలని కోరుకుంటూ దీపావళి వేళ లక్ష్మీగణపతుల పూజ చేస్తారు. మీరు కూడా లక్ష్మీగణపతులను పూజ చేసి అష్టైశ్వర్యాలను పొందండి.

Share this Story:

Follow Webdunia telugu