Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి పండుగనాడు లక్ష్మీగణపతులు

Advertiesment
దీపావళి 2012
, సోమవారం, 12 నవంబరు 2012 (22:30 IST)
WD
ప్రతి హైందవ గృహంలోనూ లక్ష్మీ దేవి రూపం వుంటుంది. విడిగా, విష్టుసమేతంగా లక్ష్మీదేవికి నిత్య పూజలు నిర్వహించడం కద్దు. దీపావళి పండుగనాడు ఆమెకు ప్రత్యేకంగా పూజ చేస్తారు. లక్ష్మీ గణపతులకు మ్రొక్కుతారు. లక్ష్మీదేవి రూపం గణపతితో పాటు వుంటుంది.

తాము నిర్వహించే కార్యాలకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడాలని సిరులిచ్చే తల్లి కరుణాకటాక్షాలు ఎల్లవేళలావుండాలని కోరుకుంటూ దీపావళి వేళ లక్ష్మీగణపతుల పూజ చేస్తారు.

దీపావళి రోజున ప్రతి ఇంటికీ లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తూ, ముంగిళ్ళను రంగవల్లులతో అలంకరిస్తారు. ప్రతిరోజు, అనేక పర్వదినాలలో లక్ష్మీదేవిని కోలిచినా, దీపావళి నాటి లక్ష్మీపూలకు విశిష్టత వుంది.

Share this Story:

Follow Webdunia telugu