Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టపాసులంటే చచ్చేంత భయం: ముమైత్

Advertiesment
ముమైత్ ఖాన్
WD
"ఇప్పటికీ నా వయసు నిండా పదహారే..." అంటూ "పోకిరి"లో కుర్రకారును ఊపేసిన ముమైత్ ఖాన్ చూడ్డానికి ధైర్యవంతురాలిలా కనిపించినా నిజానికి పరమ పిరికిదట.

సీమటపాకాయలను పిల్లలు సైతం చేతితో కాల్చి పారేస్తారైతే ముమైత్‌కు మాత్రం టపాకాయల మోతంటే చచ్చేంత భయమట. దీపావళి వచ్చిందంటే చెవుల్లో దూది పెట్టుకుని కూచుంటుందట.

ఎందుకలా అని అడిగితే.. చిన్నతనంలో టపాసులు కాలుస్తుండగా తన చెల్లెలి చేయి కాలిందట. దాంతో అప్పటి నుంచి టపాకాయలంటే భయం పట్టుకున్నదట. ఒకవేళ దీపావళి రోజున టపాసులు తెచ్చినా తను మాత్రం కాల్చేదాన్ని కాదని చిన్నప్పటి దీపావళి సంగతులను గుర్తు చేసుకున్నది ముమైత్ ఖాన్.

Share this Story:

Follow Webdunia telugu