Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఔట్లు పేల్చడమంటే నాకు భలే సరదా: మీనా

Advertiesment
మీనా
WD
వెంగమాంబ చిత్రం తర్వాత పెండ్లి చేసుకుని హనీమూన్ ముగించుకుని ఇటీవలే వచ్చిన మీనా తన భర్త మంచి స్నేహితుడని కితాబిస్తోంది. తన మనసు ఎరిగి నడుచుకుంటున్నట్లు పేర్కొంది.

దీపావళి చెన్నైలో అట్టహాసంగా జరుపుకుంటామనీ, బాణసంచా ఎక్కువగా కొంటామనీ చెపుతోంది. ముఖ్యంగా చెవులు చిల్లులు పడేంత శబ్దం చేసే ఔట్లను పేల్చడం తనకు భలే సరదాగా ఉంటుందనీ అంటోంది మీనా.

బాణసంచా పేల్చడం, కాల్చడం పూర్తయిన తర్వాత ఇంట్లో కూచుని స్వీట్లు తింటామనీ చెపుతోంది. ఇన్ని చెప్పిన మీనాను... హనీమూన్ విషయాలేంటీ అని అడిగితే మాత్రం.... గుడ్లురిమి చూస్తోంది. అదంతా వ్యక్తిగతమంటోంది.

ప్రస్తుతం మలయాళ చిత్రంలో నటిస్తున్నాననీ, ఇప్పుడప్పుడే తల్లిని అవ్వాలనే ఆలోచనే లేదని అంది. గ్లామర్ రహస్యాన్ని తెలియజేస్తూ, కాచి వడపోసిన నీటినే తాగాలనీ, పాలు లేని గ్రీన్ టీని తాగాలని సూక్తులు చెపుతోంది. ముఖ్యంగా పగటివేళ నిద్ర మంచిది కాదని అంటోంది. ఇంకేం... ఈ జాగ్రత్తలు పాటిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu