Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దీపావళి... ఒకరికి లక్ష్మి కావాలి... ఇంకొకరికి శక్తి కావాలి.. మరొకరికి సరస్వతి కావాలి... కానీ...

దీపావళి... ఒకరికి లక్ష్మి కావాలి... ఇంకొకరికి శక్తి కావాలి.. మరొకరికి సరస్వతి కావాలి... కానీ...
, మంగళవారం, 10 నవంబరు 2015 (15:06 IST)
దీపావళి పండుగను దేశంలో అట్టహాసంగా ప్రజలు జరుపుకుంటారు. ఈ పండుగను నరకాసుర వధను పురస్కరించుకుని నరక చతుర్థశిగా జరుపుతారు. ఐతే ఈ పండుగ సందర్భంగా ప్రజలు ఒక్కొక్కరు ఒక్కో కోర్కెను కోరుతూ పూజలు చేస్తుంటారు. కొందరు తమకు సంపద కావాలని కోరుకుంటూ లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇంకొందరు తమకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ శక్తిని పూజిస్తారు. మరికొందరు తాము ఉన్నత స్థితికి చేరేందుకు విద్యాభివృద్ధిని కలుగజేయాలని సరస్వతీ దేవిని కొలుస్తారు. ఏదైతేనేం అందరికీ కావలసింది అభివృద్ధి. 
 
దీపావళి అంటే దీపాల వెలుగు. ఈ దీపాల వెలుగులు పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా అన్నిచోట్లా కనబడుతుంటాయి. ఈ దీపావళి అమావాస్య చీకట్లను పారద్రోలి వెలుగులు ప్రసాదిస్తుంది. అలాగే దీపావళి జరుపుకునే ప్రతి వ్యక్తికి కూడా అంతర్గత వెలుగులు ముఖ్యం. తనలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలి తన ఎంచుకున్న మార్గంలో నడిచేందుకు స్పష్టతతో ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్నది సాధించగలరు. ఐతే కొందరు అంతా నాకు తెలుసు అనుకుంటారు కానీ తమ లోపల దాగున్న అజ్ఞానమనే గాడాంధకారాన్ని మాత్రం కనుగొనలేరు. 
 
ఇదే అందుకు ఉదాహరణ... ఓ రోజు పోలీసాఫీసరు కొత్తగా కొనుక్కున్న కారులో తనతో పాటు మంచి శిక్షకునితో బయలుదేరాడు. కొంత దూరం వెళ్లాక అతడికి ఓ పెద్ద పోలీస్ అధికారి నుంచి ఫోన్ వచ్చింది. కొందరు రోడ్డుపై తచ్చాడుతున్నారనీ, వారిని కంట్రోల్ చేసి గమ్యస్థానాలకు వెళ్లేట్లు చేయమని దాని సారాంశం. దాంతో సదరు పోలీసు
ఆఫీసరు కారులో ఆ రోడ్డుపై అటూఇటూ తిరుగుతూ ఓ మూలన గుంపుగా ఉన్నవారిని కనుగొన్నాడు. కారును వారి వద్దకు తీసుకెళ్లి ఆపి... ఏయ్... ఏంటి ఇక్కడ నిలబడ్డారు అంతా అటు వెళ్లండి అని చెప్పాడు. 
 
వారు ఒకరి ముఖం ఒకరు చూసుకుని అక్కడే నిలబడ్డారు. మళ్లీ అతడు కోపంతో ఊగిపోతూ... మీక్కాదు చెప్పేది. ఈ కార్నర్ ప్రాంతం వదిలి అంతా వెళ్లిపోండి అని అరిచాడు. దాంతో వారంతా తలోదిక్కున వెళ్లిపోయారు. ఆ తర్వాత కారు తలుపు వేసి తన పక్కనే ఉన్న వ్యక్తితో... నేను చేసింది కరెక్టుగా ఉంది కదూ.. నా మాటతో వారంతా వెళ్లిపోయారు అన్నాడు. ఐతే పక్కనే ఉన్న వ్యక్తి.. వాళ్లంతా ఓ బస్టాపులో నిలబడి ఉన్నారు. గమ్యస్థానాలకు వెళ్లాల్సిన వారిని, మీరు అక్కడి నుంచి వెళ్లపొమ్మన్నారు. మీ అధికారి ఇదేనా మీకు చెప్పింది... అంటూ ప్రశ్నించాడు.
 
కాబట్టి ఆ కార్నర్ ఏమిటో... అక్కడ ఏమున్నదో తెలుసుకోకుండా మూర్ఖంగా వారిని అక్కడ నుంచి తరిమివేసాడు పోలీసు అధికారి. అందుకే స్పష్టత లేకుండా ఏ పని చేసినా ఇలాగే ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు అంతా తమతమ మార్గాల్లో స్పష్టత ఏర్పరుచుకుని ముందుకు సాగాలని కోరుకుంటూ... దీపావళి శుభాకాంక్షలు - సద్గురు సందేశం.

Share this Story:

Follow Webdunia telugu