Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్ర‌ైవ‌ర్, వంటమనిషి, కాపలా మనిషి, సోదరుడు... వీరెవ్వ‌రితోనూ శ‌త్రుత్వం వ‌ద్దు

ఔను... డ్ర‌ైవ‌ర్, కుక్, బ్ర‌ద‌ర్... వీరెవ్వ‌రితోనూ శ‌త్రుత్వం వ‌ద్దని శాస్త్రాలు చెపుతున్నాయి. రామాయణంలో రాముడు రావణ సంహారం చేసిన సమయంలో, రావణుడు కొన ఊపిరితో ఉండగా, రాముడు లక్ష్మణుడితో మాట్లాడి ర‌మ్మంటాడు. బ్రాహ్మణుల‌లోకెల్లా పండితుడైన రావణుడి దగ్గరక

Advertiesment
Diwali 2016
, శుక్రవారం, 28 అక్టోబరు 2016 (13:01 IST)
ఔను... డ్ర‌ైవ‌ర్, కుక్, బ్ర‌ద‌ర్... వీరెవ్వ‌రితోనూ శ‌త్రుత్వం వ‌ద్దని శాస్త్రాలు చెపుతున్నాయి. రామాయణంలో రాముడు రావణ సంహారం చేసిన సమయంలో, రావణుడు కొన ఊపిరితో ఉండగా, రాముడు లక్ష్మణుడితో మాట్లాడి ర‌మ్మంటాడు. బ్రాహ్మణుల‌లోకెల్లా పండితుడైన రావణుడి దగ్గరకు వెళ్లి, ఎవరికీ తెలియని నాలుగు మంచి విషయాలు తెలుసుకోమని చెబుతాడు. అప్పుడు రావణుడు ల‌క్ష్మణుడితో ఏమి చెప్పాడంటే…
 
మన రధసారథితో, కాపలావాడితో, వంట వాడితో నీ తమ్ముడితో ఎప్పుడు స్నేహంగానే మెలగాలి. వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటే, వారు ఎప్పుడైనా, ఎటునుంచి అయినా మనకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలు తియ్యడానికి కూడా వెనకాడరు.
ఎప్పుడూ విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎల్లప్పుడూ నువ్వే గెలుస్తావని అనుకోకు.
 
- నీతో ఉంటూ నిన్ను విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకోవచ్చు. నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు.
- నీ శత్రువు చిన్నవాడు, తక్కువ వాడు అని తక్కువ అంచనా వెయ్యవద్దు. ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు? నేను హనుమంతుడిని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను.
- దేవుడిని ప్రేమించవచ్చు లేదా ద్వేషించవచ్చు కాని ఏదైనా కూడా అపారమైన దృఢనిశ్చయంతో ఉండాలి.
- రాజుకు యుద్ధంలో గెలవాలని కోరిక ఉండాలి కాని, ఎప్పటికీ అత్యాశాపరుడై ఉండకూడదు.
- ఇతరులకు, సైన్యానికి అవకాశం ఇచ్చి, రాజు అలసిపోకుండా పోరాడతేనే విజయం సొంతం అవుతుంది.
ఈ మాటలు చెబుతూ ప్రాణాలు వదిలేస్తాడు రావణుడు. ఆయన చెప్పిన మాటలు మన జీవితానికి, ఈ ఆధునిక యుగానికి కూడా వర్తిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి స్వీట్... గులాబ్ జామన్ తయారు చేయడం ఇలా...