కావలసిన పదార్థాలు :
శనగపిండి... అరకేజీ
చక్కెర... రెండు కప్పులు
డాల్డా... ఒక కప్పు
సోడా ఉప్పు... తగినంత
నూనె... వేయించేందుకు సరిపడా
యాలక్కాయల పొడి... పావు టీస్పూన్
జీడిపప్పులు... ఒక కప్పు
తయారీ విధానం :
శనగపిండిలో సోడా ఉప్పు, కొంచెం నూనె, నీళ్ళు పోసి చక్రాల పిండిలాగా కలపాలి, తరువాత ఈ పిండిని కాగుతున్న నూనెలో బూందీలాగా వేయాలి. బాగా లేతరంగు వచ్చేదాకా వీటిని వేయించి తీసేయాలి.
ఇప్పుడు పంచదారకు తగినన్ని నీళ్లు కలిపి తీగపాకం వచ్చేదాకా స్టవ్‌పై ఉంచాలి. పాత్రను కిందికి దించి పైన తయారు చేసుకున్న బూందీని వేసి బాగా కలియబెట్టాలి. అందులోనే డాల్డా, యాలక్కాయల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు వేసి కలపాలి.
వేడి చల్లారిన తరువాత కొద్ది కొద్దిగా ఆ మిశ్రమాన్ని తీసుకుని ఉండలు చుట్టుకోవాలి. అంతే శెనగపిండితో తయారైన తొక్కుడు లడ్డు సిద్ధమైనట్లే... తీపి పదార్థాల పండుగైన ఈ "దీపావళి"కి మీరు కూడా ప్రయత్నిస్తారు కదూ...!