Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రకరకాల ఆకృతులలో ప్రమిదలు

Advertiesment
ప్రమిదలు దీపావళి పండుగ దీపాలు లక్ష్మీదేవి దేవతలు బాణా సంచా
దీపావళి పండుగనాడు ప్రతి ఇల్లు దీపాల వరుసలతో కళకళలాడుతుంటుంది. ఈ దీపాలను వెలిగించేందుకు ఉపయోగించే ప్రమిదల ఎంపిక వారం రోజుల ముందు నుంచే జరుగుతుంటుంది. ముఖ్యంగా మట్టి ప్రమిదలకు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

ఈ ప్రమిదలకున్న ప్రాధాన్యత దృష్ట్యా ఈసారి వ్యాపారులు విభిన్న రకాలైన ఆకారాలలో ప్రమిదలను తయారు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. శివపార్వతుల స్వరూపాలు, వివిధ దేవతల ఆకృతులు, లక్ష్మీ దేవి ఆకృతులలో ప్రమిదలను తయారు చేశారు.

మొత్తం 25 రూపాలలో ఈ ప్రమిదలను వ్యాపారులు తయారు చేశారు. ప్రతి ఒక్క వెరైటీ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. సంప్రదాయాలకు అనుగుణంగా ఏ వస్తువుకైనా కొత్తదనాన్ని జోడిస్తే ప్రజలను తప్పకుండా ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. మొత్తమ్మీద ఈసారి ఈ ప్రమిదలను ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు మహిళలు.

Share this Story:

Follow Webdunia telugu