Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెలుగుల పండుగకు.. వెరైటీ టపాకాయలు

వెలుగుల పండుగకు.. వెరైటీ టపాకాయలు
WD PhotoWD
దీపావళి అనగానే.. ఆబాల గోపాలతమంతా అత్యంత ఉత్సాహంతో బాణా సంచా కాల్చుతారు. వివిధ రకాల రంగులను వెదజల్లే టపాకాయలను, తారా జువ్వలను పేల్చి అదో రకమైన అనుభూతికి, ఆనందాన్ని పొందుతారు. ఈ దీపావళి కొంగ్రొత్త వెలుగులు నింపనుంది. నేల నుంచి నింగికి దూసుకెళ్లి పెద్ద శబ్దంతో పేలి, పలు రకాల రంగులను వెదజల్లే అనేక ఫ్యాన్సీ టపాకాయలతో పాటు.. ఒక్కసారి వెలిగిస్తే ఆకాశంలోకి రాకెట్ వేగంతో దూసుకెళ్లే తారాజువ్వల వెలుగులు ఈ దీపావళికి కనువిందు చేయనున్నాయి.

ముఖ్యంగా.. స్వదేశంలో తయారైన టపాకాయలే కాకుండా.. చైనాలో తయారైన ఫ్యాన్సీ టపాసులు కూడా ఈ దీపావళికి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ టపాకాయలు వెదజిమ్మే రంగురంగుల వల్ల ఈ దీపావళి మరింత శోభాయమానం కానుంది.

ఈ దీపావళి స్పెషల్... 'విశ్వ కా ఖజానా'
దీని పేరులోనే ఈ బాణాసంచా పనితనం చెప్పకనే తెలిసిపోతుంది. దీన్ని ఒక్కసారి వెలిగిస్తే చాలు.. తారాజువ్వలు రాకెట్ వేగంతో ఆకాశంలోకి దూసుకెళతాయి. అనేక సార్లు నింగిలోకి దూసుకెళ్లే విశ్వ కా ఖజానా తారాజువ్వ పెద్ద శబ్దంతో పేలి, కళ్లు మిరుమిట్లు గొలిపే రంగురంగుల కాంతులను వెదజల్లుతుంది. ఈ తారాజువ్వకు బాంబుతో పాటు.. ఫ్లాష్ ఉండటం దీని ప్రత్యేకత.

webdunia
WD PhotoWD
'సూపర్ హిట్' టపాకాయల
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో హిట్టైన పలు చిత్రాల పేరుతో తయారైన ఫ్యాన్సీ టపాకాయలు మార్కెట్‌లో జోరుగా అమ్ముడుపోతున్నాయి. 'ధూమ్' చిత్రం పేరుతో తయారైన ఫ్యాన్సీ టపాసు ప్రత్యేక ఆకర్షణగావుంది. దీన్ని ఒక్కసారి వెలిగిస్తే చాలు.. యాభై నుంచి అరవై సార్లు గాలిలోకి దూసుకెళ్లి వింతవింత శబ్దాలతో మెరుపులు వెదజల్లడం దీని ప్రత్యేకత.

అంతేకాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా హిట్టైన ఆంగ్ల సినిమా 'లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్' పేరిట మార్కెట్‌లోకి వచ్చిన బాణాసంచా నగర వాసులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఒక్కసారి దీన్ని వెలిగించగానే గాల్లోకి వెళ్లే ఈ తారాజువ్వ 120 సార్లు రింగ్స్‌‌గా కనిపిస్తూ మెరుపులు మెరిపిస్తుంది.

ఎన్నెన్నో రకాలు..
వీటితో పాటు.. చైనా నుంచి ప్రత్యేకంగా దిగుపతి చేసుకున్న క్రాకలింగ్ బుల్లెట్, మిరాకిల్, సింగర్ షాట్‌లు ఉన్నాయి. అలాగే.. యోయో, రెయినీ స్టార్, రెడ్ ఫిల్టర్, మెరిండా గోల్డ్, ఏరియన్ ఫన్, గెలాక్సీ, గోల్డెన్ విల్లో, కలర్ మిర్చీ, స్కై స్టాపర్, హ్యాపీ ఫీట్, గ్రీన్ జిల్టర్, రాపవర్ వంటి రకాలు ఈ దీపావళికి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. వీటితో పాటు.. స్వదేశీయంగా తయారైన బాణా సంచా విక్రయాలు కూడా జోరుగానే సాగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu