కావలసిన పదార్థాలు
శెనగ పిండి: ఒక కప్పు
పంచదార: రెండు కప్పులు
నీరు: అరకప్పు
ఏలకుల పొడి: అర టీస్పూన్
ఎండు ద్రాక్ష: పది
జీడిపప్పు: పది
బటర్: అరకప్పు
తయారీ విధానం:
వేడి చేసిన బాణలిలో రెండు కప్పుల పంచదార, అరకప్పు నీటిని చేర్చి సన్నని సెగమీద మరిగించి పాకం తయారు చేసుకోవాలి. పాకం కాస్త మరిగాక అందులో ఏలకుల పొడి చేర్చి దించి పక్కన పెట్టుకోవాలి. నేతితో గానీ, వెన్నతో గానీ జీడిపప్పు, ఎండు ద్రాక్షను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ మధ్యలో వేడెక్కిన బాణలిలో కలిపి పెట్టిన మినప పిండితో బూందిలను వేయించి ఓ పాత్రలో తీసి పెట్టుకోవాలి.
బూందీలు, వేడి చల్లారాక వాటిని పంచదార పాకంలో కాస్త కాస్త వేస్తూ మెల్లగా కలియబెట్టాలి. తర్వాత చేతికి కాస్త నూనెను పట్టించి బూంది మిశ్రమాన్ని లడ్డులుగా ఉండలుగా చేసుకోవాలి. ఉండలు చేసేముందు వాటితో జీడిపప్పు, ద్రాక్షలను చేర్చుకోవాలి.