Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి లేహ్యం

దీపావళి లేహ్యం
FileFILE
లేహ్యానికి కావలసిన పదార్థాలు:
అల్లం: 100 గ్రాములు
బెల్లం: 150 గ్రాములు
జీలకర్ర: 50 గ్రాములు
ధనియాలు: 25 గ్రాములు
నెయ్యి: 50 గ్రాములు

తయారీ విధానం:
లేత అల్లం ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ధనియాలు, జీలకర్రను అరగంటపాటు ఊరనివ్వండి. అల్లంముక్కలను మిక్సిలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో నానబెట్టిన ధనియాలు, జీలకర్రను చేర్చి రుబ్బుకోవాలి. ఇందులో బెల్లం కలిపి మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేడయిన బాణలిలో మిశ్రమాన్ని కలియబెట్టండి. తర్వాత నెయ్యి చేర్చి మెల్లమెల్లగా కలుపుతూ స్టౌ మీద నుంచి దించేయండి. ఈ లేహ్యాన్ని మరో పాత్రలో భద్రపరచండి.

Share this Story:

Follow Webdunia telugu