Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపాల పండుగపై తారల ముచ్చట్లు

దీపాల పండుగపై తారల ముచ్చట్లు
, బుధవారం, 7 నవంబరు 2007 (20:38 IST)
WD
నా ఫేవరేట్ పండుగ: మహేష్ బాబు
దీపావళి నా ఫేవరేట్ పండుగ. చిన్నప్పుడు ఆ రోజు రెండు గంటలపాటు ఏకధాటిగా చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, మతాబులు కాల్చేవాళ్ళం. లక్ష్మీ ఔట్ అయితే దూరంగా ఉండి పొడవాటి కర్రకు నిప్పు వెలిగించి కాల్చే వాళ్ళం. ఆ రోజు సాయంత్రం సినిమా చూసేవాళ్ళం. రాత్రికి వచ్చి టపాసులు కాల్చేవాడిని. ఇప్పుడు సినిమా హీరో అయినా కాలుస్తూనే ఉన్నాను. హైదరాబాద్‌లోనే మా ఫ్యామిలీతో ఈ దీపావళి గడుపుతాను. "అతిథి" తర్వాత మూడు నెలల పాటు షూటింగ్‌లు లేవు. కాబట్టి... చాలా సరదాగా చేసుకుంటాను.

ఎక్కడున్నా దీపావళి చేసుకుంటా: మమతామోహన్‌దాస
webdunia
WD

నేను ఎక్కడున్నా దీపావళి చేసుకుంటాను. చిన్నతనంలో స్కూల్ స్నేహితులతో కలిసి చేసుకునేవాళ్ళం. కొత్త బట్టలు, స్వీట్లు అవన్నీ తలచుకుంటేనే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మా స్కూల్లో చదివేవాళ్ళు మా ఇంటి పక్కపక్కనే ఉండేవారు. అంతా కలిసి చాలా ఎంజాయ్ చేసే వాళ్ళం. హీరోయిన్ అయినా ఆ పండుగను కంటెన్యూ చేస్తునే ఉన్నాను. చిన్నప్పుడు మా బామ్మ ఓ మాట చెబుతుండేది. మతాబులు కాలిస్తే దోమలు, చిన్న పురుగులు రావని.. అందుకే ఇంటిలో పొగవచ్చేదాకా వాటిని కాల్చేదాన్ని. అని నవ్వుకుంటూ గతాన్ని గుర్తు చేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu