Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టపాకాయలు కాల్చబోతున్నారా... కాస్త జాగ్రత్త

Advertiesment
టపాకాయలు కాల్చబోతున్నారా... కాస్త జాగ్రత్త
, సోమవారం, 5 నవంబరు 2007 (18:46 IST)
WD PhotoWD
దీపావళి.. టపాకాయల పండగ. వీటిని కాల్చకుండా ఈ పండుగను జరుపుకోలేము. అదే దీని ప్రత్యేకత. అయితే.. వీటిని కాల్చే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించక పోతే.. కొత్త వెలుగులు విరజిమ్మే దీపావళి నాడు... మీ ఇంట విషాధం నెలకొనే ప్రమాదం ఉంది. అందువల్ల టపాకాయలను కాల్చే మందు కొన్ని జాగ్రత్తలు పాటించినట్టయితే మీ ఇంటిల్లిపాది ఆనందోత్సవాలే.

పాటించాల్సిన జాగ్రత్తలు...
* పేల్చడానికి ఉంచిన టపాకాయకు కనీసం 25 అడుగుల దూరంలో ఉండాలి.
* టపాకాయలను పేల్చే సమయంలో పక్కనే బకెట్‌ నిండా నీళ్లు ఉంచుకోవడం మంచిది.
* సరిగా పేలని టపాకాయలను మళ్లీ పేల్చేందుకు ప్రయత్నించ కూడదు. వీటిని తొలగించే సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఒకే సమయంలో రెండు మూడు టపాకాయలను పేల్చేందుకు ప్రయత్నించకూడదు.
* టపాకాయకు నిప్పు అంటించిన వెంటనే దానికి దూరంగా వెళ్లాలి.

* శంకు, భూచక్రాలను ఇంటిలో కాల్చే ముందు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇవి పేలిపోవడం జరుగుతుంటాయి.
* చిన్నారులు మాత్రమే కాల్చగలికే టపాకాయలను మాత్రమే కొనివ్వాలి. ధర తక్కువ వుండే బాణాసంచాలను కొనుగోలు చేయక పోవడం మంచిది.
* టపాకాయ పేల్చేందుకు కొసను తొలగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
* కొత్త రకాల బాణాసంచాను కాల్చేటప్పుడు.. పాటించాల్సిన జాగ్రత్తలను తు.చ.తప్పకుండా పాటించాలి.
* టపాకాయలను కాల్చేందుకు పొడవాటి కడ్డీలను ఉపయోగించాలి.

* కాల్చాల్చిన టపాకాయలను మీ చొక్కా, ఫ్యాటు ప్యాకెట్లలో ఉంచుకోరాదు.
* చిన్నారుల చేతిలో టపాకాయను ఉంచి, దానికి నిప్పంటించి గాలిలోకి విసిరేందుకు ప్రయత్నించరాదు. ఇది కొన్ని సందర్భాల్లో ప్రమాదానికి దారితీయవచ్చు.
* టపాకాయలను పేల్చే చిన్నారులను జాగ్రత్తగా గమనిస్తుండాలి.
* ఐదేళ్ళలోపు చిన్నారులతో బాణాసంచాకు దూరంగా ఉంచాలి.
* బాణాసంచా కాల్చేముందు.. మీరు అత్యంత ప్రేమగా పెంచుకునే కుక్క, పిల్లులను బోనుల్లో ఉంచి, తాళం వేయడం మంచిది.
* వీధుల్లో టపాకాయలు పేల్చడం నేరం. అయితే పట్టణాలు, నగరాల్లో మాత్రం వేరే మార్గం లేదు. ఈ ప్రాంతాల వాసులు కాస్త జాగ్రత్త పాటించి టపాసులను పేల్చాలి.

Share this Story:

Follow Webdunia telugu