Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాణాసంచా కాంతులతో శ్వాసకోశ వ్యాధులు: సీపీసీబీ

బాణాసంచా కాంతులతో శ్వాసకోశ వ్యాధులు: సీపీసీబీ
రంగులకాంతులు విరజిమ్మే దీపావళి పండగు దగ్గరపడుతున్న కొద్దీ దేశంలోని యువతలోను ఉత్సాహం ఉరకలు వేస్తోంది. మార్కెట్‌ కెళ్లి మతాబులు, చిచ్చుబుడ్లు, బాంబులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. అయితే.. వీటిని కాల్చే ముందు కొన్ని సూచనలు పాటించమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ముఖ్యంగా.. ముఖానికి, చెవులకు మాస్క్‌లను విధిగా ధరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే మతాబులు, కాకరపువ్వొత్తులు విరజిమ్మే కాంతులు కొన్ని తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలిగిస్తాయని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) తాజాగాగ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

టపాసుల్లో ఉన్న రకాలలో దాదాపుగా 95 శాతం నుంచి కాలుష్యమే వెలువడుతుందని, వాటి నుంచి వెలువడే వ్యాధికారక సూక్ష్మ కణాలు నాలుగు మీటర్ల వరకు విస్తరిస్తాయని ఆ అధ్యయనంలో తెలింది. టపాసుల తయారీలో హాని కలిగించే రసాయనాలు వాడతారని, వాటి నుంచి వెలువడే పొగ ఆస్తమా, అలర్జీ, బ్రాంకైటిస్‌ వంటి వ్యాధులను కలిగిస్తుందని ఓ కార్పోరేట్ ఆస్పత్రి సీనియర్‌ వైద్యుడు అన్నారు.

అంతేకాకుండా.. పెద్ద శబ్దంతో కూడిన టపాకాయలను పేల్చినపుడు కర్ణభేరికి హాని కలుగుతుందని సీపీసీబి అంటోంది. అందువల్ల మీకు ఇష్టమైన బాణాసంచాను కాల్చేముందు.. మీ భద్రతను గురించి ఆరోచించాలని, అందుకోసం మాస్క్‌లు ధరించటం మంచిదని కాలుష్య నియంత్రణ బోర్డు నిపుణులు చూసిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu