కావలసిన పదార్థాలు..
మైదా: 300 గ్రాములు
పాలు: నాలుగు టీ స్పూన్లు
నీరు: సరిపడా
పంచదార పౌడర్: 150 గ్రాములు
నెయ్యి: రెండు టీ స్పూన్లు
నూనె: తగినంత
కొబ్బరి తురుము: రెండు కప్పులు
పాలకోవ: 250 గ్రాములు
తయారీవిధానం:
మైదాపిండిని ఒక బౌల్‌లో తీసుకుని దానికి సరిపడా నీటిని, నాలుగు టీ స్పూన్ల పాలును కలిపి చపాతీ పిండిలా తయారుచేసుకోవాలి. ఈ పిండితో పది చపాతీలను రుద్దుకోవాలి. వాటిని సగంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంతలో వేడయిన బాణలిలో నూనెను పోసి పంచదార, పాలకోవను కాసేపు వేయించండి.
ఇందులో కొబ్బరి తురుమును చేర్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ వేయింపును 1 1/2 స్పూన్ తీసుకుని అర్థభాగం చేసిన చపాతీ ముక్కలో మధ్యగా ఉంచి చపాతీనీ "డీ" ఆకారంలో చేసుకుని నూనెలో బ్రౌన్ కలర్‌గా వేయించి సర్వ్ చేయొచ్చు.