Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతర్జాలంలో తెలుగు వెలుగులు

Advertiesment
అంతర్జాలంలో తెలుగు వెలుగులు

జ్యోతి వలబోజు

హైదరాబాదులో తెలుగు బ్లాగర్ల సమావేశం

అంతర్జాలం(ఇంటర్నెట్)లో సాధారణంగా అందరూ ఇంగ్లీషు ఉపయోగిస్తుంటారు. ఉత్తరాలకైనా, వెబ్‌సైట్లకైనా ఇంగ్లీషు తప్పనిసరి. కాని గత రెండేళ్లుగా ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని చెప్పవచ్చు. ఎందరో తెలుగు భాషాభినుల కృషిఫలితంగా కలం పట్టి కాగితంపై రాసినంత తేలిగ్గా ఇంటర్నెట్‌లో కూడా ఎటువంటి సాఫ్ట్‌వేర్ లేకుండా తెలుగు రాసే వివిధ ఉపకరణాలు తయారుచేయబడ్డాయి.

తెలుగులోనే సైట్లు మొదలయ్యాయి. తరతరాలకు ఉపయోగపడే విజ్ఞాన సర్వస్వం వికీపీడియా విజయవంతంగా దేశభాషలన్నింటిలో అగ్రస్థానంలో ఉంది. ఈ మధ్య కాలంలో అంతర్జాలంలోని మరో సాంకేతిక విప్లవం తెలుగు బ్లాగులు అని చెప్పవచ్చు. ఈ బ్లాగు అనేది మన స్వంత పుస్తకం లాంటిది. ఇందులో మన ఆలోచనలు, అభిరుచులు, సామాజిక సంఘటనలపై మన అభిప్రాయాలు.. ఇలా ఎన్నో రచనలు చేసుకోవచ్చు.

ఇందుకు పైసా ఖర్చు కూడా కాదు. ఎటువంటి నిభంధనలు, ఆంక్షలు ఉండవు. ఈ బ్లాగులో రచనలు ఎందరో తెలుగువారితో పంచుకుని చర్చించుకోవచ్చు కూడా. అంతే కాక మన రచనలకు ఎంతో వేగంగా స్పందన లభిస్తుంది. ప్రశంశ ఐనా, విమర్శ ఐనా.. ఇలా ఎన్నో అంశాలపై వెయ్యికి పైగా ఉన్న తెలుగు బ్లాగులు అంతర్జాలంలో తెలుగు వెలుగులు విరజిమ్ముతున్నాయి. ప్రతి నెల రెండవ ఆదివారం హైదరాబాదులో ఉన్న తెలుగు బ్లాగర్లు ముఖాముఖీ సమావేశమవుతారు.

ఈ సమావేశాలలో బ్లాగింగులోని సాంకేతిక లేదా ఇతర సమస్యలని ఇతరులని అడిగి ఎలా పరిష్కరించుకోవాలి. అంతర్జాలంలో తెలుగును ఎలా వ్యాప్తి చేయాలి, కంప్యూటర్లో తెలుగు ఎంత సులువుగా చదవొచ్చు, రాయొచ్చు, ఎన్నో విధాల ఉపయోగించుకోవచ్చు.... అనే విషయాలను కంప్యూటర్ వినియోగదారులకు తెలియజెప్పాలి. వాటిని చర్చించి అమలు పరుస్తున్నారు కూడా.

ఈ క్రమంలో డిసెంబర్ 14 ఆదివారం ప్రపంచ తెలుగు బ్లాగర్ల దినోత్సవంగా నిర్ణయించి, హైదరాబాదులోని కృష్ణకాంత్ పార్కులో హైదరాబాదు తెలుగు బ్లాగర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పైన చెప్పబడిన అంశాలు చర్చించబడ్డాయి. అవి అమలు పరచే దిశగా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.

ఇవీ, ఇంకా ఇలాంటి అనేక విషయాలను తెలుసుకొనేందుకు కింది లింకులను చూడండి.
1. మీ కంప్యూటరులో తెలుగు సరిగా కనిపించకపోతే, అంతర్జాల తెలుగు సంఘం వారి వెబ్‌సైటు "ఇతెలుగు డాట్ ఆర్గ్‌"లోని సహాయకేంద్రం చూడండి
2. బ్లాగుల గురించి తెలిసికొనేందుకు "కూడలి డాట్ ఆర్గ్" చూడండి
3. బ్లాగులకు సంబంధించి సహాయం కోసం "గ్రూప్స్ డాట్ గూగుల్ డాట్ కామ్/గ్రూప్/తెలుగు బ్లాగ్" చూడండి
అదే విధంగా తెలుగు బ్లాగర్లకోసం వెబ్‌దునియా బ్లాగు సౌకర్యాన్ని అందించింది. నూతన బ్లాగులను నిర్వహించదలచినవారు....
"తెలుగు డాట్ మై వెబ్‌దునియా డాట్ కామ్" వీక్షించండి. మీ బ్లాగు... మీ లోకం... ప్రయత్నించండి మరి .

Share this Story:

Follow Webdunia telugu