Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీకు ఇష్టమైన అడవి జంతువు ఏది...? పర్యావరణంలో దాని పరిస్థితి ఏంటి...?

ప్రకృతిలోని సకల జీవరాశులు, అడవులు, కొండలు, నదులు, సముద్రాలు, ఆకాశం, భూ అంతర్భాగ వస్తువులు అన్నీ కలిసిన జీవావరణ ప్రాంతాన్ని పర్యావరణం అంటారు. వాయువులు, మూలకాలు, ఇతర జీవధాతువులు తమ పరిధిలో ఉంటే బాధలేదు.

Advertiesment
World Environment Day
, శనివారం, 4 జూన్ 2016 (20:49 IST)
ప్రకృతిలోని సకల జీవరాశులు, అడవులు, కొండలు, నదులు, సముద్రాలు, ఆకాశం, భూ అంతర్భాగ వస్తువులు అన్నీ కలిసిన జీవావరణ ప్రాంతాన్ని పర్యావరణం అంటారు. వాయువులు, మూలకాలు, ఇతర జీవధాతువులు తమ పరిధిలో ఉంటే బాధలేదు. కాని నేడు పర్యావరణ సంక్షోభం పెద్ద ప్రమాదంగా పరిణమించింది. ప్రకృతిలో భాగమైన మానవులు ఆ ప్రకృతినే జయించాలని సాగించే కార్యకలాపాల వలన ప్రకృతి సమతుల్యం దెబ్బతింటున్నది.
ఫోటో కర్టెసీ-పెటా


భారీ ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, ఖనిజాల త్రవ్వకం, అడవుల నరికివేత, అధిక వాహనాల వినియోగం, పట్టణాల విస్తరణ మొదలైన అనేక అంశాల కారణంగా పర్యావరణ వైపరీత్యం ఏర్పడుతుంది. ఓజోన్ పొర దెబ్బతింటుంది. జలాలు, వాయువు కలుషితమవుతున్నాయి. అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. పచ్చని పొలాలు బీడు భూములు అవుతున్నాయి. సకాలంలో వర్షాలు పడక ప్రజలు త్రాగు – సాగు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారు. వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూ కాలుష్యం, శబ్ద కాలుష్యం మానవ సమాజాలను అతలాకుతలం చేస్తున్నాయి.
 
ప్రపంచ బ్యాంకు నివేదికను బట్టి ఏటా మన దేశంలో 40 వేల మంది వాయుకాలుష్యంతో అకాల మరణం చెందుతున్నారని తెలుస్తుంది. వాటర్ షెడ్ పథకాలను కరువు ప్రాంతాలలో అమలు చేయాలి. పట్టణాలలో వర్షపు నీరు ఎక్కడికక్కడే భూమి లోపలికి ఇంకిపోయేటట్లు  చేయాలి. నీటి మట్టం తగ్గిన చోట రీఛార్జింగ్ ప్రక్రియ జరపాలి. సమాజంలో ప్రతి ఒక్కరు పరిసరాలను రక్షించుకునే దృక్పథాన్ని పెంచుకోవాలి. సహజ వనరులను సాధ్యమైనంత వరకు వినియోగించుకోవాలి. విద్యార్థులకు యల్.కె.జి. నుండు పి.జి. వరకు పర్యావరణ అంశాలు పాఠ్యాంశాలుగా నిర్ణయించాలి. ప్రచార సాధనాల ద్వారా ప్రజలకు పర్యావరణ పరిరక్షణ పరిజ్ఞానాన్ని కలిగించాలి. ప్రభుత్వము ప్రజలు స్పందించి కలిసికట్టగా కృషి చేసినప్పుడే పర్యావరణ పరిరక్షణ సుసాధ్యమవుతుంది.
 
పచ్చదనం – పరిశుభ్రత, నీరు – చెట్టు, స్వచ్ఛ భారత్ తదితర కార్యక్రమాలలో ప్రజలు చిత్తశుద్ధితో పాల్గొనేలా ప్రభుత్వాలు ప్రచారాన్ని, అవగాహనను ప్రజలలో కలిగించాలి, పచ్చని చెట్లను పెంచడం ప్రతిఒక్కరూ ఒక బాధ్యతగా భావించాలి. వ్యర్థ పదార్ధాలను విడిచే ఫ్యాక్టరీలను పట్టణాలకు దూరంగా పెట్టి, ఆ ఫ్యాక్టరీల చుట్టూ చెట్లు పెంచాలి. దీన్నే హరిత కవచము అంటారు. నదులు వగైరా జల వనరులలో చెత్త, ఫ్యాక్టరీల వ్యర్థాలు కలువకుండా జాగ్రత్తవహించాలి. ప్రజలు తమ గ్రామల్లోని జలవనరులను కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవాలి. 
webdunia
ఫోటో కర్టెసీ-పెటా
 
శబ్ద కాలుష్యాన్ని కలిగించే మైకుల గోలను బలవంతంగా అరికట్టాలి. పోలీసు శాఖ దీనిపై అంక్షలు విధించాలి. కార్లు, మోటార్ సైకిళ్ళు కాలుష్యం కల్గించకుండా వాటి ఇంజన్లు శుభ్రం చేయించాలి. గంగా, యమున వంటి నదులు కలుషితం కాకుండా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలి – ప్రభుత్వాలు – స్వచ్ఛంద సంస్థలు – ప్రపంచ ఆరోగ్య సంస్థలూ దీనిపై శ్రద్ధ వహించి, పర్యావరణ పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు పర్యావరణ కాలుష్యం బారి నుండి ప్రపంచాన్ని రక్షించడానికి తగిన కార్యచరణను రూపొంది, అమలు చేయాలి. ప్రతి ఏటా ఓ లక్ష్యంతో పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిస్తుంటారు. ఈసారి మీకు ఇష్టమైన అడవి జంతువు ఏది...? దాని సంరక్షణ ఎలా జరుగుతుంది... సాయం చేద్దాం... ఆదుకుందాం పదండి. పర్యావరణాన్ని రక్షిస్తేనే మనం సురక్షితంగా ఉంటామన్న సంగతి మర్చిపోవద్దు.
- డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెదేపాకు కాక పుట్టిస్తున్న జగన్... కేసీఆర్ స్టైల్‌లో... బాబు సచ్చినట్టు చేస్తాడు... రాయలసీమలో అంతే...