Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అమ్మ' అక్రమాస్తుల కేసు అజిత్‌కు అడ్డా? తమిళనాడు తాత్కాలిక సీఎం వైగోనా? జయ స్ట్రాటజీ ఏంటి?

తమిళనాడు సీఎం జయలలిత ఆస్పత్రిలో అనారోగ్యంతో చేరిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఆరోగ్యంపై ఇన్నాళ్ళు అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వై

Advertiesment
Jayalalithaa
, బుధవారం, 12 అక్టోబరు 2016 (13:10 IST)
తమిళనాడు సీఎం జయలలిత ఆస్పత్రిలో అనారోగ్యంతో చేరిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఆరోగ్యంపై ఇన్నాళ్ళు అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు క్లారిటీ ఇచ్చారు. ఇంకా విశ్రాంతి కావాలని వైద్యులు సూచించడంతో జయలలిత తన శాఖలను ఆర్థిక మంత్రి ఓ పన్నీర్ సెల్వంకు బదలాయించారు. 

జయమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా.. కోలుకునేందుకు సమయం పడుతుందని.. దీంతో తదుపరి సీఎంను నియమించేందుకు అన్నాడీఎంకే వర్గాలు ప్లాన్ చేస్తున్నాయని సమాచారం. తాజాగా ఎండీఎంకే నేత వైగోనే తమిళనాడు తదుపరి సీఎం అని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా వేగవంతంగా సాగుతున్నాయని తెలిసింది.  
 
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సెప్టెంబర్ 22వ తేదీ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. ఆమెకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలో తమిళనాడు తాత్కాలిక సీఎంను ఎంచుకోవాలని కొందరు, రాష్ట్రపతి పాలనకు ఏర్పాటు చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే అన్నాడీఎంకేకు చెందిన మంత్రులు మాత్రం సీఎం ఆరోగ్యంగా ఉన్నారని త్వరలో పగ్గాలు చేపడతారని చెప్తున్నారు.

మరోవైపు జయమ్మ స్నేహితురాలు శశికళ సీఎంగా నియామకం కానున్నారని, ఆమె భర్త నటరాజన్ అన్నాడీఎంకే అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ వీరిపై కేసులుండటంతో వైకోను తాత్కాలిక సీఎంగా నియమించాలనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
 
కానీ తమిళ హీరో అజిత్‌ను ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా జయమ్మ సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. తన ఆస్తుల బినామీలను ఆయన పేరిట అమ్మ రాసేసిందని సమాచారం. కానీ అజిత్ మాత్రం అమ్మపై ఇప్పటికే అక్రమాస్తుల కేసులుండటంతో.. రాజకీయాల్లో అరంగేట్రం చేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కేసుల కొట్టివేసిన తర్వాత పార్టీ క్లీన్ చిట్ అయ్యాకే అన్నాడీఎంకేలో తాను పాలుపంచుకుంటానని అజిత్ చెప్పేసినట్లు సమాచారం. ఇప్పటికే గుడ్ హీరోగా పేరు సంపాదించిన అజిత్.. పార్టీలోని అవినీతిని ఏరేస్తేనే ఆ పార్టీలోకి వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మరి అమ్మ ఏం చేస్తారో అనేది వేచి చూడాలి. అజిత్‌కు సీఎం పదవి ఇస్తారో.. వైగోను సీఎంగా నియమిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలు పురుడు పోసుకోవడానికి ఆ గ్రామంలో పెద్దలు ఒప్పుకోరట...