Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పన్నీర్ సెల్వం రాజీనామా పత్రాన్ని వెనక్కి తీసుకోలేరుగానీ... అలా చేయొచ్చు

తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఓ.పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఆ తర్వాత దానిపై రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ఆమోదముద్ర వేసి.. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేంతవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగ

పన్నీర్ సెల్వం రాజీనామా పత్రాన్ని వెనక్కి తీసుకోలేరుగానీ... అలా చేయొచ్చు
, శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (12:48 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఓ.పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఆ తర్వాత దానిపై రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ఆమోదముద్ర వేసి.. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేంతవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలాని కోరగా, దానికి పన్నీర్ సమ్మతించారు. 
 
ఆ తర్వాత అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళపై ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆ తర్వాత తనతో శశికళ వర్గీయులు, తంబిదురై బృందం కలిసి బలవంతంగా రాజీనామా చేయించారని పన్నీర్ ఆరోపించారు. ఇదేవిషయాన్ని గురువారం గవర్నర్ భేటీ సమయంలోనూ నొక్కివక్కాణించారు. పైగా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ సార్.. రాజీనామాను వెనక్కి తీసుకుంటాను అని విజ్ఞప్తి చేశారు. దీనికి గవర్నర్ వైపు ఎలాంటి స్పందన లేదు. 
 
అయితే పన్నీరు సెల్వం రాజీనామాపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. అసలు రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు వీలుందా లేదా అన్న విషయంపై న్యాయనిపుణులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. కొత్త సీఎం ప్రమాణం స్వీకారం చేసేవరకు ఓ.పన్నీరు సెల్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పడం వల్ల సాంకేతికంగా రాజీనామాను వాపసు తీసుకోవడం సాధ్యం కాదన్నారు. 
 
అంతటితో ఆగని ఆయన ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని మద్దతు ఎక్కువగా ఉంది.. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరవచ్చని వారు అంటున్నారు. తద్వారా డీఎంకే మద్దతుతో సీఎం పీఠాన్ని కైవసం చేసుకుని మన్నార్గుడి మాఫియాను పోయెస్ గార్డెన్ నుంచి తరిమి కొట్టడమే కాకుండా, అన్నాడీఎంకే పార్టీని సైతం తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలన్నది పన్నీర్ సెల్వం యోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలు గుర్తింపు లేని హీరోలు.. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ : వెంకయ్య