సైరన్ మిస్త్రీపై వేటు వెనుక మిస్టరీ ఇదే... వ్యాపార విలువలకు పాతర.. ధనార్జనే ధ్యేయంగా...
టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలిగించారు. ఈ మేరకు టాటా బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వార్త వెలువడగానే టాటా గ్రూపు షేర్ల విలువ పతనమయ్యాయి. ఒక కార్పొరేట్ దిగ్గజం అత్యున్నత స్థా
టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలిగించారు. ఈ మేరకు టాటా బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వార్త వెలువడగానే టాటా గ్రూపు షేర్ల విలువ పతనమయ్యాయి. ఒక కార్పొరేట్ దిగ్గజం అత్యున్నత స్థాయి నాయకత్వాన్ని ఏమాత్రం ముందస్తు సంకేతాలు లేకుండా ఒక్కదెబ్బతో మార్చేయడం దేశీయ కార్పొరేట్ రంగంలో పెను సంచలనంగా మారింది. ఈ తరహా నిర్ణయం తీసుకోవడం దేశంలో బహుశా ఇదే తొలిసారని పారిశ్రామిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈయన తొలగింపునకు కారణాలు లేకపోలేదు.
44 యేళ్ల వయసులోనే టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరన్ మిస్త్రీ కీలక బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయనకు సుదీర్ఘకాలంపాటు అగ్ర నాయకత్వ బాధ్యతలు నిర్వహించే వెసులుబాటు ఉండటంతో ఆయన సారథ్యంలో టాటా గ్రూప్ కొత్త శిఖరాలను చేరుతుందని మార్కెట్ పండితులు అంచనావేశారు. అయితే, అందరి అంచనాలు తారుమారయ్యాయి. మిస్త్రీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టాటా గ్రూప్‌లో డజన్ల సంఖ్యలో ఉన్న కంపెనీల్లో లాభాల్లో నడుస్తున్న వాటిపై మాత్రమే ఫోకస్ పెడుతూ నష్టాల్లో ఉన్న సంస్థలను వదిలించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది బోర్డు పెద్దలకు ఏమాత్రం రుచించలేదు.
పైగా కొన్ని దశాబ్దాలుగా టాటా గ్రూప్ పాటిస్తున్న వ్యాపార విలువలు, తాత్వికతకు సైరస్ ధోరణి భిన్నంగా ఉంటూ వచ్చింది. కంపెనీ రుణాలు పెరగడంతో పాటు.. ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఇలాంటి అనేక అంశాలు మిస్త్రీ ఉద్వాసనకు దారితీశాయి. టాటా సన్స్‌లో మెజార్టీ వాటాలు (దాదాపు 66 శాతం వాటా) టాటా ట్రస్ట్‌ల చేతుల్లో ఉన్నాయి. టాటా కుటుంబ సభ్యుల సారథ్యంలో ఉన్న ఈ ట్రస్ట్‌లు ప్రధానంగా ధార్మిక, సమాజ సేవ కార్యక్రమాల నిర్వహణలో ఉన్నాయి. ఇందులో సర్ దోరబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లు అత్యంత కీలకమైనవి. ఈ ట్రస్ట్‌ల నుంచి కూడా టాటాసన్స్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తప్పించాల్సిందిగా ఒత్తిడి వచ్చిందనీ అందువల్లే ఆయనకు బోర్డు ఉద్వాసన పలికందనే వార్తలు పరిశ్రమలో వినొస్తున్నాయి.