Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'టాటా సన్స్' ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి ఉద్వాసన.. తదుపరి ఛైర్మన్‌ రేసులో ఉన్నవారు వీరే

‘టాటా సన్స్’ ఛైర్మన్‌గా ఉన్న సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికారు. కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేసేందుకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్‌లో రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్ర, రోన్ సేన్, కుమార్

'టాటా సన్స్' ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి ఉద్వాసన.. తదుపరి ఛైర్మన్‌ రేసులో ఉన్నవారు వీరే
, మంగళవారం, 25 అక్టోబరు 2016 (12:53 IST)
‘టాటా సన్స్’ ఛైర్మన్‌గా ఉన్న సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికారు. కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేసేందుకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్‌లో రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్ర, రోన్ సేన్, కుమార్ భట్టాచార్య ఉన్నారు. అయితే, నాలుగు నెలల పాటు తాత్కాలిక ఛైర్మన్‌గా రతన్ టాటా వ్యవహరించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, 2012లో టాటా సన్స్ సంస్థ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే. 
 
అయితే సైరన్ మిస్త్రీని టాటా ఛైర్మన్ గ్రూపు నుంచి అనూహ్యంగా తప్పించడం ఇపుడు కార్పొరేట్ రంగంలో పెనుసంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో, అత్యంత విలువైన టాటా గ్రూప్ తదుపరి ఛైర్మన్ ఎవరు కాబోతున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. నూతన ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. మొత్తం ప్రక్రియ ముగియడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని... ఛైర్మన్ ఎంపిక కమిటీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. 
 
ఛైర్మన్ పదవిని చేపట్టబోయే వారి లిస్టులో ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిలో పెప్పీకో సీఈవో ఇంద్రానూయి, వొడాఫోన్ మాజీ సీఈవో అరుణ్ శరీన్, టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్.చంద్రశేఖరన్, నోయెల్ టాటా, టాటా గ్రూపుకే చెందిన ఇషాంత్ హుస్సేన్, ముత్తురామన్‌లు ఉన్నారు. వారిలో ఇంద్రానూయి, నోయెల్ టాటా విషయంలో రతన్ టాటా సానుకూలతతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వీరిద్దరిలో కూడా నోయెల్ టాటావైపే రతన్ టాటా ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. బయటి వ్యక్తుల కంటే, తమ కుటుంబంలో భాగమైన వ్యక్తికి బాధ్యతలను అప్పగించవచ్చని తెలుస్తోంది. మరోవైపు, అంతర్జాతీయంగా పేరున్న వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే కోణంలో కూడా టాటా గ్రూపు ఆలోచిస్తోంది. ఈ కోణంలో చూస్తే, ఇంద్రానూయికి ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ ఐటీ సిటీ: టెక్కీలపై క్యాబ్‌లో లైంగిక వేధింపులు.. 12 గంటల వ్యవధిలో..?