అపుడేమో జగన్‌ను తొక్కేశారు... ఇపుడేమో సురేష్‌ను ముంచేసిన పవన్ కళ్యాణ్...
ఆంధ్రులది ఆరంభ శూరత్వమే అనే అపవాదుని నిజం చేయాలనుకున్నట్లుంది జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ తీరు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టా.. ప్రజల తరపున గళమెత్తేందుకే ముందుకొచ్చా అనే డైలాగులతో తెరపైకి వచ్చి, తెలుగుదేశం, భాజపాలకు మద్దతు ఇచ్చి జగన్‌ను తొక్కేసారనే పేరు
ఆంధ్రులది ఆరంభ శూరత్వమే అనే అపవాదుని నిజం చేయాలనుకున్నట్లుంది జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ తీరు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టా.. ప్రజల తరపున గళమెత్తేందుకే ముందుకొచ్చా అనే డైలాగులతో తెరపైకి వచ్చి, తెలుగుదేశం, భాజపాలకు మద్దతు ఇచ్చి జగన్‌ను తొక్కేసారనే పేరుతో పాటు.. నిజంగా ప్రజలకు అవసరమైనప్పుడు అస్సలు పట్టించుకోకుండా ముఖం చాటేస్తున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తూ.గో జిల్లాలోని తుండూరులో ఆక్వా ఫుడ్ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా మామూలుగానే పవన్ కళ్యాణ్ చాలా తీవ్రస్థాయిలో తన మద్దతుని మాత్రమే తెలియజేసారు. ఆవేశంగా ప్రసంగాలిచ్చేసి, మీ వెనుక నేనున్నానంటూ హామీలిచ్చేసి ఆ తర్వాత షరా మామూలుగానే కాటమరాయుడుతో బిజీ అయిపోయారు. ఈయన గుప్పించిన వరాల జల్లు ప్రభావమో ఏంటో కానీ సర్దారే మన పక్కనుంటాడు అనే ధీమాతో మల్లుల సురేష్ అనే వ్యక్తి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేసాడు.
ఫలితంగా ఖైదీ నం.150 సినిమాలో చిరంజీవి ఎదుర్కొన్నన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. అక్రమ కేసుల బనాయింపు, భౌతిక దాడులు, కుటుంబ సభ్యులకు బెదిరింపులు వంటి అన్ని కార్పొరేట్ స్టైల్ పద్ధతులకు బలయ్యాడు ఈ విశ్వమానవ వేదిక అధ్యక్షుడు మల్లుల సురేష్. స్థానిక నాయకులు, అధికార యంత్రాంగం, పోలీసు శాఖ ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నా అండగా ఉంటానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఏ విధంగానూ ప్రతిస్పందించకపోవడం మరింత బాధిస్తోందని వాపోతున్నారు స్థానికులు.
అసలు ఎవరీ మల్లుల సురేష్..?
ఓ పేరుమోసిన దినపత్రికలో వేల రూపాయల జీతాన్ని త్యాగం చేసి, పాలకొల్లు నుండి నిత్యాన్నదానం, రక్తదాన శిబిరం, వైద్యశిబిరాలు, అనాథ శవాల దహనం వంటి ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ, గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ మూలంగా తలెత్తిన, తలెత్తబోయే సమస్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అక్కడి స్థానికులకు మద్దతుగా పోరాటం చేస్తున్నారు మల్లుల సురేష్. మరి ఈయనకు జనసేనాని ఏమేరకు మద్దతుగా నిలుస్తారో చూడాలి.