Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేతగా రమ్మని ప్రజలు పిలుస్తున్నారు.. కార్యకర్తలు అండగా ఉన్నారు.. రజినీకాంత్ ఏం చేస్తారు?

తమిళనాడు రాజకీయాల్లో సూపర్‌స్టార్ రజినీకాంత్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన పేరు చర్చల్లోకి వచ్చింది. నాయకుడిగా ప్రజలు పిలుస్తున్నారు. కార్య

నేతగా రమ్మని ప్రజలు పిలుస్తున్నారు.. కార్యకర్తలు అండగా ఉన్నారు.. రజినీకాంత్ ఏం చేస్తారు?
, మంగళవారం, 3 జనవరి 2017 (10:59 IST)
తమిళనాడు రాజకీయాల్లో సూపర్‌స్టార్ రజినీకాంత్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన పేరు చర్చల్లోకి వచ్చింది. నాయకుడిగా ప్రజలు పిలుస్తున్నారు. కార్యకర్తలు అండగా ఉంటామన్నారు. కానీ, రజినీకాంత్ వైపు నుంచి మాత్రం స్పందన రావడం లేదు. 
 
ప్రస్తుతం తమిళనాట రాజకీయ పరిణామాలు రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్నాయి. జయలలిత మరణం తర్వాత తమిళనాడు ప్రభుత్వ పగ్గాలు ఎవరు చేపట్టాలన్న విషయంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జయలలిత మరణం అనంతరం ఆమె అనుంగుడు పన్నీర్‌‌సెల్వంను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న విషయంతెలిసిందే.
 
అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత నెచ్చెలి శశికళను అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ముఖ్యనేతల్లో కొందరు వత్తిడితెస్తున్నారు. అయితే ఆమె ప్రధాన కార్యదర్శి కావడం కార్యకర్తల్లో చాలా మందికి మింగుడు పడటంలేదు. 
 
ముఖ్యంగా కిందిస్థాయి కార్యకర్తలు అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ పేరు తెరపైకి వచ్చి రాజకీయవర్గాల్లో కలకలం పుట్టిస్తోంది. దీనికి కారణం సూపర్‌స్టార్‌ అభిమానులే. వారు తమ తలైవర్‌ రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా కోరుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'రత్తాలు'గా అందంగా చూపినందుకు చాలా థ్యాంక్స్... సుస్మితకు లక్ష్మీరాయ్ థ్యాంక్స్