Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నై నగరానికి ఏమైంది...? హత్యలు... ప్రేమోన్మాదాలు... అక్రమ సంబంధాలు... చెన్నైలో ఏం జరుగుతోంది...?

చెన్నై నగరం అంటే ఒకప్పుడు చాలా ప్రశాంత నగరంగా పేరుండేది. అలాంటిది ఇటీవలి కాలంలో వరుస హత్యలతో చెన్నై నగరం అట్టుడుకిపోతోంది. గత నెల జూన్ 24న ఇన్ఫోసిస్ మహిళా ఉద్యోగి స్వాతి చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టే

చెన్నై నగరానికి ఏమైంది...? హత్యలు... ప్రేమోన్మాదాలు... అక్రమ సంబంధాలు... చెన్నైలో ఏం జరుగుతోంది...?
, బుధవారం, 13 జులై 2016 (15:54 IST)
చెన్నై నగరం అంటే ఒకప్పుడు చాలా ప్రశాంత నగరంగా పేరుండేది. అలాంటిది ఇటీవలి కాలంలో వరుస హత్యలతో చెన్నై నగరం అట్టుడుకిపోతోంది. గత నెల జూన్ 24న ఇన్ఫోసిస్ మహిళా ఉద్యోగి స్వాతి చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషనులో అత్యంత దారుణంగా హత్య చేయబడింది. మొన్న మంగళవారం నాడు మద్రాసు హైకోర్టులో న్యాయవాదిని నరికారు. ఈ న్యాయవాదిని అతడి కుమారుడే కుటుంబ తగాదాల కారణంగా అతడిపై కత్తితో దాడికి దిగాడు. 
 
మనిమరన్ అనే ఈ న్యాయవాదికి ఇద్దరు భార్యలు. కాగా రెండో భార్యతో ఇతడు జీవిస్తున్నాడు. తన మొదటి భార్య సంతానానికి ఇది రుచించలేదు. అంతేకాదు మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనికి కారణం తన చెల్లెలికి సంబంధాలు చూడటం లేదనీ, రెండో భార్య వద్దే కులుకుతూ తమను పట్టించుకోవడం లేదనేది అతడి ఆరోపణ. ఆ కారణంగా న్యాయవాది పైన అతడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కేవలం స్వాతి హత్య తర్వాత మూడు వారాలకే చోటుచేసుకుంది. 
 
నెల క్రితం మరో హత్య జరిగింది. జూన్ 5వ తేదీన నలుగురు దుండగులు ఓ న్యాయవాదిని నరికి చంపారు. ఈ ఘటన వెనుక అతడి భార్య, ఆమె ప్రియుడు హస్తం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. దీనితో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అఘాయిత్యాలు మనుషుల వరకే పరిమిత కాలేదు. 
 
చిట్టచివరికి ఓ యువకుడు తన డాబా టెర్రస్ పైనుంచి ఓ కుక్కను కిందకు తోసేస్తే, దాన్ని కెమేరాల ద్వారా ఇద్దరు యువకులు చిత్రీకరించారు. ఆ కుక్క అరుస్తూ పై నుంచి కింద పడుతూ ఉంటే వారంతా పైశాచిక ఆనందాన్ని చవిచూశాడు. తాము పొందిన ఆనందాన్ని తమతో ఉంచుకోలేక దాన్ని కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేసి అందరి ఆగ్రహానికి గురయ్యారు. విశేషమేమిటంటే వీరంతా డాక్టర్ కోర్స్ చేస్తున్నారు మరి. ఇలాంటి దారుణానికి పాల్పడ్డారు కనుక వీరిని ఎట్టి పరిస్థితుల్లో వైద్య కోర్సును కొనసాగించడానికి వీల్లేదంటూ డిమాండ్లు వచ్చాయి. 
 
ఇక గొలుసు దొంగతనాలు, అమ్మాయిల కిడ్నాపులు, కొట్టుకోవడాలు అన్నీ కలిసి నేరాల చిట్టాను పెంచుతూ పోతున్నాయి. దీనితో ప్రశాంతంగా ఉండే చెన్నై నగరం ఇమేజ్ కాస్తా మసకబారుతోంది. 2014 సంవత్సరం గణంకాల ప్రకారం లక్ష మంది జనాభాకు 200 నేరాలు జరిగాయి. అదేసమయంలో దేశంలో ఇతర నగరాల్లో ఈ సంఖ్య రెట్టింపుగా ఉంది. అందువల్ల చెన్నై ప్రశాంతమైన నగరంగా పేరొందింది. కానీ 2015-16 సంవత్సరాల్లో ఈ సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో చెన్నై ఇమేజ్ డ్యామేజ్ కావడం ఇక ఎంతో దూరంలో లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఖల్‌నాయక్' జకీర్ నాయక్‌ తల తెగ నరికితే రూ.15 లక్షలిస్తాం.. హుస్సైని టైగర్స్ రివార్డు