Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జైల్లో శశి, దీక్షలో పన్నీర్, సుచీ లీక్స్... ఈ 'చెన్నై' నగరానికి ఏమయింది?(JOKES)

ఇపుడు దేశంలో ఏ నగరం నిత్యం వార్తల్లో వుంటుందంటే అది చెన్నై నగరం అని చటుక్కున చెప్పేసే పరిస్థితి వచ్చింది. ఈ నగరానికి ఏమైంది అనే ప్రకటన మాదిరిగా తయారైంది ఇక్కడి పరిస్థితి. చెన్నై టెక్కీ స్వాతి హత్య మొద

జైల్లో శశి, దీక్షలో పన్నీర్, సుచీ లీక్స్... ఈ 'చెన్నై' నగరానికి ఏమయింది?(JOKES)
, గురువారం, 9 మార్చి 2017 (15:33 IST)
ఇపుడు దేశంలో ఏ నగరం నిత్యం వార్తల్లో వుంటుందంటే అది చెన్నై నగరం అని చటుక్కున చెప్పేసే పరిస్థితి వచ్చింది. ఈ నగరానికి ఏమైంది అనే ప్రకటన మాదిరిగా తయారైంది ఇక్కడి పరిస్థితి. చెన్నై టెక్కీ స్వాతి హత్య మొదలుకొని ఏదో ఒక సంఘటన నిత్యం అగ్గిలా రగులుతూనే వుంది. చెన్నై టెక్కీ స్వాతి హత్య కేసు ముగిసిపోయిందంటూ స్థానిక ఎగ్మూర్ కోర్టు ప్రకటించడంపై పైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. స్వాతి కేసు అలా నడుస్తుండగానే ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం బారిన పడ్డారు. ఆమె అనారోగ్యంతో 75 రోజులపాటు అపోలో ఆసుపత్రిలోనే వున్నారు. చివరకు డిసెంబరు 5న మరణించారు. 
 
ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలు అలా సాగుతుండగానే జయలలిత నెచ్చెలి శశికళ అనూహ్యంగా అన్నాడీఎంకె పగ్గాలు చేపట్టారు.  ఆమె పార్టీ చీఫ్ కావడంతో పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. అవలా సాగుతుండగానే హఠాత్తుగా తమిళనాడు సాంప్రదాయ క్రీడ జల్లికట్టు తెరపైకి వచ్చింది. తమిళనాడు యువత అంతా చెన్నై మెరీనా తీరానికి చేరుకుని తమ సంప్రదాయ క్రీడపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ నానా హంగామా చేశారు. దీనితో అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చి జల్లికట్టు క్రీడకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ వెంటనే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేసారు. 
webdunia
 

అడ్డు తొలగిందనుకున్న శశి.. ఆ వెంటనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తానంటూ గవర్నర్ విద్యాసాగర్ రావుకి తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల లిస్టును ఆయనకు అందజేశారు. ఇంతలో జయలలిత అక్రమాస్తుల కేసును సుప్రీంకోర్టు విచారించింది. ఈ విచారణలో శశికళ దోషిగా తేలడంతో ఆమెకు నాలుగన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమె ఆశలు కాస్తా అడియాశలై ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాల్సిన యోగం తప్పిపోయి కారాగార వాసం లభించింది. పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఐతే ఆయన కుర్చీ సేఫ్ కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ దీక్షకు దిగారు.
webdunia
 

రాజకీయ పరిస్థితులు ఇలావుంటే కోలీవుడ్ సినీ ఇండస్ట్రీని గాయని సుచిత్ర తన ట్విట్టర్ ఖాతా ద్వారా అల్లకల్లోలం సృష్టించారు. రజినీకాంత్ అల్లుడు ధనుష్, సంగీత దర్శకుడు అనిరుధ్, నటి ఆండ్రియా, అమలాపాల్, త్రిష ఇలా అనేకమంది వ్యక్తిగత ఫోటోలను బయటపెడుతూ సినీ ఇండస్ట్రీలో చీకటి కోణాలంటూ వీడియోలను సైతం జోడించారు. దీనిపై కోలీవుడ్ ఇండస్ట్రీ షాక్ తిన్నది. ఐతే సుచిత్ర లీక్స్ మాత్రం ఆగలేదు. ఆమెను ఎలా నిలువరించాలో తెలియక చాలామంది తలలు పట్టుకున్నారు. చివరికి ఆమెను లండన్ లోని మెంటల్ ఆసుపత్రికి తరలించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు చెప్పినట్లు సమాచారం. ఇలా చెన్నై నగరం అతలాకుతలం అవుతోంది. ప్రస్తుతానికైతే చెన్నై జనం దీన్ని JOKES అని పిలుస్తున్నారు. Jayalalithaa-O PanneerSelvam-K Sasikala-E Palaniswamy-Suchitra.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో భారతీయులు, పాకిస్తాన్‌లో హిందువులపై దాడులు... చంపేస్తున్నారు...