Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్వేతసౌధం ఆహ్వానించేది ఎవరిని? హిల్లరీ ముందు ట్రంప్ donald 'duck out' అవుతారా...?

అబ్బబ్బ... గత కొన్ని నెలలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థుల తిట్ల పురాణం మనకు తెలియనిది కాదు. బూతులు తిట్టుకోవడం దగ్గర్నుంచి సెక్స్ స్కాండల్స్ వరకూ వెళ్లిపోయారు. అమెరికా నడివీధుల్లో డోనాల్డ్ ట్రంప్ నగ్న విగ్రహాలు వెలిశాయి. ఇక హిల్లరీ అన

Advertiesment
#PresidentialFootwear
, మంగళవారం, 8 నవంబరు 2016 (18:05 IST)
అబ్బబ్బ... గత కొన్ని నెలలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థుల తిట్ల పురాణం మనకు తెలియనిది కాదు. బూతులు తిట్టుకోవడం దగ్గర్నుంచి సెక్స్ స్కాండల్స్ వరకూ వెళ్లిపోయారు. అమెరికా నడివీధుల్లో డోనాల్డ్ ట్రంప్ నగ్న విగ్రహాలు వెలిశాయి. ఇక హిల్లరీ అనారోగ్యం గురుంచీ, ఆమె పాకిస్తాన్ తొత్తు అంటూ డొనాల్డ్ ట్రంప్ వర్గం చేసిన విమర్శలు కూడా మిన్నంటాయి. ఎలక్ట్రానిక్, పత్రిక, సోషల్ మీడియాతో ఆటాడుకున్న ఈ ఇద్దరిలో ఇపుడు ఎవరు విజేతో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ప్రిపోల్ ఫలితాల్లో హిల్లరీ ముందు ట్రంప్ donald 'duck out' అవుతారంటూ కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే హిల్లరీ క్లింటన్ బోణీ కొట్టడంతో డెమొక్రట్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. 
 
హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్షురాలు అవుతారంటూ 70 శాతం ప్రిరిజల్ట్స్ వెల్లడిస్తున్నాయి. అమెరికన్ పోల్‌స్టర్ ఈ ఎన్నికలను అత్యంత కీలకమైనవిగానూ, ఉత్కంఠతను రేకెత్తించేవిగానూ అభివర్ణించింది. 538 వెబ్ సైట్ కు చెందిన నాట్ సిల్వర్ అంచనాల ప్రకారం హిల్లరీకే విజయం దక్కుతుంది. గతంలో నాటె అంచనాలు తారుమారు కాలేదు. చెప్పింది చెప్పినట్లు జరిగింది. ఫలితం వచ్చింది. దీనితో హిల్లరీ గెలుపు ఖాయం అనే నమ్మకం అధికమవుతోంది.
 
హిల్లరీకి, డోనాల్డ్ ట్రంపుకు మధ్య ఓట్ల శాతం చాలా స్వల్పంగా ఉండబోతుందని మరో సర్వే తెలిపింది. మొత్తమ్మీద చూస్తే పోలింగ్ సమయంలో ట్రంప్ భారతదేశం, చైనా దేశాల గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన విజయావకాశంపై ప్రభావం చూపబోతోందని అంటున్నారు. అమెరికాలోని ఉద్యోగాలను భారత్, చైనాలు ఎగరేసుకుపోతున్నాయనీ, వాటిని అదుపు చేసుకుని అమెరికాకే దక్కేట్లు చేయాలన్న ట్రంప్ వ్యాఖ్యలు వికటించినట్లు తెలుస్తోంది. మరి ఫలితం ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలాంటి దారుణం ఎక్కడైనా మీరు చూశారా? యువకుడిని శవపేటికలో బలవంతంగా పడుకోబెట్టి... (వీడియో)